అనూహ్యంగా మారకుండా చూద్దామని మంచు విష్ణుతో చెప్పా: ప్రకాశ్ రాజ్

By telugu teamFirst Published Jun 25, 2021, 11:11 AM IST
Highlights

తాను మంచు విష్ణుకు ఫోన్ చేసి మాట్లాడానని, మా ఎన్నికలు అనూహ్యంగా మారకుండా చూద్దామని చెప్పానని ప్రకాశ్ రాజ్ అన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు.

హైదరాబాద్: మా ఎన్నికలు అనూహ్యంగా మారకుండా చూద్దామని తాను మంచు విష్ణుకు ఫోన్ చేసి చెప్పినట్లు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చెప్పారు. మా అధ్యక్షుడిగా హీరో మంచు విష్ణు కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడురు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

మా ఎన్నికలు సున్నితమైనవని ప్రకాశ్ రాజ్ అన్నారు. తనను నాన్ లోకల్ అనండ కొత్తేమీ కాదని ఆయన అన్నారు. రెండు గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు గానీ అవార్డులు తీసుకున్నప్పుడు గానీ నాన్ లోకల్ ముందుకు రాలేదని ఆయన చెప్పారు. తమ ప్యానెల్ ఆవేదనతో పుట్టిన బిడ్డ అన్నారు. తెలుగులో తనకు ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్ అని ఆయన చెప్పారు. రాజకీయంగా నాగబాబుతో తనకు విభేదాలున్నా ఇక్కడ తామిద్దరం ఒక్కటేనని ఆయన అన్నారు. 

బిజీగా ఉంటారు కదా, మాకు సమయం ఇవ్వగలరా అని అడిగితే సమయం విలువ తెలిసినవాడు ఏమైనా చేయగలడని ఆయన అన్నారు. తాను బార్యాపిల్లలను చూసుకుంటున్నానని, ఇతర పనులూ చేస్తున్నానని ఆయన అన్నారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వివాదాల్లోకి మెగాస్టార్ చిరంజీవిని ఎందుకు లాగుతున్నారని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అడిగారు. తనను నాన్ లోకల్ అనడంపై ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ అధ్యక్షుడిగా 27 మంది ప్యానెల్ సభ్యుల ఎంపిక పూర్తయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడారు 

లోకల్ - నాన్ లోకల్ ఏమిటని ఆ.యన అడిగారు. కళాకారులకు నాన్ లోకల్ ఎమిటని ఆయన ప్రశ్నించారు. కళాకారులు యూనివర్సల్ అని ఆయన అన్నారు. తాను గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనేది ఎందుకు ముందుకు రాలేదని ఆయన అడిగారు. సినిమా అనేదే ఓ భాష, పరిభాష అని ఆయన చెప్పారు. ఏ దేశంలో ఉన్నాం మనమని ఆయన అడిగారు.

అందరూ అందరికీ కావాల్సినవారేనని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఎవరికి వీలైనంతవాళ్లు చేశారని ఆయన అన్నారు.తాము కోపంతో ప్యానెల్ పెట్టడం లేదని, ఆవేదనతో ప్యానెల్ ను పోటీకి దించుతున్నామని ఆయన చెప్పారు. ఎవరో చేయలేదని చెప్పడానికి తాను రావడం లేదని, ప్రకాశ్ రాజ్ సడెన్ గా వచ్చినవాడు కాదని ఆయన అన్నారు. ఏడాదిగా కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. 

తాను తప్పు చేస్తే తానే బయటకు గెంటేసే గట్టివాళ్లు ప్యానెల్ లో ఉన్నారని ఆయన చెప్పారు. అధ్యక్షులుగా పనిచేసినవాళ్లు నలుగురు ఉన్నారని ప్రకాశ్ రాజ్ చెప్పారు. తాము పదవుల కోసం పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. మా అనేది అందరికీ వినోదంగా మారిపోయిందని ఆయన అన్నారు. తప్పులు చేస్తే మనలోనే కూర్చుని మాట్లాడుకోవాలని ఆయన అన్నారు. అకారణ శత్రుత్వం వద్దని ఆయన అన్నారు. అందరూ అశ్చర్యపడేలా పనిచేస్తామని ఆయన చెప్పారు. తనకు పనిచేసేవాళ్లు, క్రమశిక్షణ చెప్పేవాళ్లు కావాలని అన్నారు.

మంచి వ్యక్తి మా అధ్యక్షుడిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రకాశ్ రాజ్ ను బలపరుస్తున్నట్లు నాగబాబు చెప్పారు. ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అనే మాట సరైంది కాదని ఆయన చెప్పారు. తెలంగాణలో ప్రకాశ్ రాజ్ గ్రామాలను దత్తు తీసుకున్నారని చెప్పారు. లోకల్ నాన్ లోకల్ అర్ఙరహిత వాదన అన్నారు. లోకల్, నాన్ లోకల్ అంటే కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలు అయి ఉండేవారు కాదని ఆయన అన్నారు. ప్రకాశ్ రాజ్ గురించి, ఆయన అభ్యర్థిత్వానికి గల కారణాల గురించి బండ్ల గణేష్ మాట్లాడారు. రాజకీయాలతో, వర్గాలతో తమకు సంబంధం లేదని ఆయన టెప్పారు.

ప్రకాశ్ రాజ్ కు మద్దతు తెలుపుతూ జయసుధ పంపిన వీడియో సందేశాన్ని ప్రదర్శించి చూపించారు. ప్రకాశ్ రాజ్ ప్రకటించిన ప్యానెల్ లో జయసుధ కూడా ఉన్నారు. 

click me!