విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ తండ్రి మృతి

Published : Jan 07, 2023, 09:53 AM IST
విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ తండ్రి మృతి

సారాంశం

సుచిత్ర చంద్రబోస్ టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నారు. సుచిత్ర చంద్రబోస్ , గేయ రచయిత చంద్రబోస్ దంపతులు అనే సంగతి తెలిసిందే. తాజాగా వీరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

సుచిత్ర చంద్రబోస్ టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నారు. సుచిత్ర చంద్రబోస్ , గేయ రచయిత చంద్రబోస్ దంపతులు అనే సంగతి తెలిసిందే. తాజాగా వీరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సుచిత్ర చంద్రబోస్ తండ్రి చాంద్ బాషా (92) రాత్రి హైదరాబాద్ మణికొండలో మృతి చెందారు. చాంద్ బాషా.. చంద్రబోస్ కి మామగారు. 

చాంద్ బాషా దక్షిణాదిలో అనేక సినిమాలకు సంగీత దర్శకునిగా పనిచేసారు.  చాంద్ బాషా కి ముగ్గురు అమ్మాయిలు ,ఒక కొడుకు ఉన్నారు. తెలుగులో  ఖడ్గ తిక్కన్న ,బంగారు సంకెళ్లు ,స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు కన్నడంలో అమర భారతి , చేడిన కిడి కన్నడ వంటి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు మహాప్రస్థానం లో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. 

చాంద్ బాషా మృతితో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. చంద్రబోస్ ఫ్యామిలీకి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సుచిత్ర కొరియోగ్రాఫర్ గా రాణిస్తుండగా.. చంద్రబోస్ స్టార్ లిరిసిస్ట్ గా గుర్తింపు పొందారు. చంద్రబోస్ కలం నుంచి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వస్తున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

Ram Charan v/s Pawan Kalyan: పెద్ది మూవీ వాయిదా? బాబాయ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కోసం చరణ్‌ వెనక్కి
Illu Illalu Pillalu Today Episode Jan 24: ఇడ్లీ బాబాయిని చంపేస్తానన్న విశ్వక్, రాత్రికి అమూల్య జంప్?