
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు’ ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, ఈ మూవీని ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ లుక్ అల్ట్రా స్టైలిష్‌గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ చూస్తే అర్థమవుతోంది. కాగా, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారిసు ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ కు మిక్సెడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే జనవరి 11 న రిలీజ్ కు ప్లాన్ చేసిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆ రోజు రిలీజ్ కావటం లేదనేది వార్త.
USA లో తమిళ వెర్షన్ కు ప్రీమియర్స్ పడుతున్నాయి. కానీ తెలుగు వెర్షన్ కు వేయటం లేదు. ఆంధ్రా,తెలంగాణా లలో సైతం ఈ చిత్రం తెలుగు వెర్షన్ రిలీజ్ కావటం లేదని ట్రేడ్ వర్గాల సమాచారం. తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ త్వరలో ఎనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. సంక్రాంతికు రెండు పెద్ద హీరోల సినిమాలు పోటా,పోటీగా రిలీజ్ అవుతూండటంతో ఆ హీరోలతో రిలేషన్ దెబ్బతింటుందని ప్రక్కకు వెళ్లాడంటున్నారు. సంక్రాంతి రిలీజ్ ల అనంతరం వారసుడుని రిలీజ్ చేసే అవకాసం ఉందంటున్నారు.
విజయ్ సరసన హీరోయిన్ గా రష్మిక సందడి చేయనున్న ఈ సినిమాలో, శరత్ కుమార్ .. సుమన్ .. ప్రకాశ్ రాజ్ .. ప్రభు .. శ్యామ్ .. జయసుధ .. ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమన్ నుంచి వచ్చిన పాటల్లో రంజితమే సాంగ్ బాగా హిట్ అయిన సంగతి తెలిసిందే .
'వారసుడు' సినిమాకు సంబంధించి దిల్ రాజు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు హీరోగా తొలుత విజయ్ ను అనుకోలేదని చెప్పారు. మహేశ్ బాబుతో ఈ చిత్రాన్ని చేయాలని వంశీ పైడిపల్లి అనుకున్నారని, అయితే వేరే ప్రాజెక్ట్ తో మహేశ్ బిజీగా ఉండటం వల్ల కుదరలేదని చెప్పారు. ఆ తర్వాత రాంచరణ్ తో అనుకున్నామని, కానీ ఆయన అప్పటికే తన తదుపరి సినిమా డిస్కషన్ లో ఉండటంతో సాధ్యపడలేదని తెలిపారు. దీంతో, చివరకు ఈ సినిమా విజయ్ వద్దకు వెళ్లిందని అన్నారు.
ఈ సారి సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి చిత్రం 'వాల్తేరు వీరయ్య' జనవరి 13న వస్తోంది. బాలయ్య సినిమా 'వీరసింహా రెడ్డి' జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ రెండు చిత్రాలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించినవే కావడం గమనార్హం.