ఇండియన్ 2.. ఎవడన్నాడు?

By Prashanth MFirst Published 20, Feb 2019, 3:07 PM IST
Highlights

శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమా గురించి ఇటీవల ఒక రూమర్ తెగ వైరల్ అయ్యింది. మెయిన్ గా కోలీవుడ్ లో సినిమా ఆగిపోయిందని అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే ఫైనల్ గా సినిమా నిర్మాణ సంస్థ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడమే కాకుండా వచ్చిన రూమర్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు. 

ఇండియన్ సీక్వెల్ ను 2.0 నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెత్ తో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మొదట 150 కోట్ల ఖర్చుతో సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్ వచ్చింది. అయితే శంకర్ బడ్జెట్ లెక్కలు దాటడంతో లైకా సంస్థ బడ్జెట్ లో లెక్కలు తేలే వరకు సినిమాను స్టార్ట్ చేసేదిలేదని శంకర్ కి కౌంటర్ ఇచ్చినట్లు టాక్ వచ్చింది. ఈ రూమర్ మరింత వైరల్ అవ్వకముందే లైకా ప్రొడక్షన్స్ నుంచి ఒక క్లారిటీ వచ్చింది. 

సంస్థకు సంబందించి ఒక వ్యక్తి కోలీవుడ్ మీడియాతో ఇటీవల మాట్లాడారు.. అనవసరమైన రూమర్స్ ని నమ్మవద్దని.. సినిమా ఆగిపోయిందని ఎవడన్నాడు అంటూ ఊహాగానాలపై ఆగ్రహించినట్లు సమాచారం. రీసెంట్ గా ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో షెడ్యూల్ ను నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేసే ప్రయత్నాల్లో ఉంది. చెన్నైలో వేసిన ఒక సెట్ లో కమల్ అండ్ కాజల్ కి సంబందించిన సీన్స్ ని షూట్ చేయనున్నారు. 

Last Updated 20, Feb 2019, 3:07 PM IST