త్రివిక్రమ్ కి నాతో అవసరమేంటి..? హైపర్ ఆది కామెంట్స్!

By Udaya DFirst Published 20, Feb 2019, 2:22 PM IST
Highlights

'జబర్దస్త్' షోతో సూపర్ పాపులారిటీ దక్కించుకున్నాడు కమెడియన్ హైపర్ ఆది. ఈ షోలోనే కాకుండా సినిమాల్లో కమెడియన్ గా కనిపిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. పంచ్ లు వేయడంతో ఆదిని కొట్టేవారే లేరని అభిమానులు అంటుంటారు. 

రీసెంట్ గా ఇతడు దర్శకుడు త్రివిక్రమ్ ని కలిశాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో త్రివిక్రమ్ సినిమాలో కామెడీ పంచ్ లు రాయడం కోసం హైపర్ ఆదిని తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

దీంతో ఈ వార్తలపై స్పందించాడు హైపర్ ఆది. త్రివిక్రమ్ గారిపై తనకు ఎంతో అభిమానం ఉందని, ఆ కారణంగానే ఆయన్ను మూడు సార్లు కలవడం జరిగిందని అన్నారు. అభిమానంతో అతడిని కలిశానే తప్ప అంతకుమించి ఏం లేదని చెప్పుకొచ్చాడు.

త్రివిక్రమ్ సినిమాలకు మాటలు రాసేంత వ్యక్తిని కాదంటూ వెల్లడించాడు. త్రివిక్రమ్ గారు ఆయన తీసే సినిమాలకు కథ, మాటలు ఆయన సొంతగా రాసుకుంటారని, ఆయనకి ఎవరి అవసరం లేదని అన్నారు. తనతో మాటలు రాయించుకోవాల్సిన అవసరం త్రివిక్రమ్ కి లేదని ఆది చెప్పాడు. 
 
Last Updated 20, Feb 2019, 2:22 PM IST