
లస్ట్ స్టోరీస్ సీజన్ 1 భారీ సక్సెస్ అందుకుంది. లస్ట్ స్టోరీస్ లో కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్, రాధికా ఆప్టే నటించారు. సీజన్ 2 సరికొత్తగా సిద్ధమైంది. జూన్ 29 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. తమన్నా, కాజోల్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు చేశారు. లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ చూశాక ఆడియన్స్ ఇది అడల్ట్ కంటెంట్ అని ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సిరీస్ జోలికి పోయే ఆస్కారం లేదు. అయితే అవన్నీ అపోహలే, లస్ట్ స్టోరీస్ 2 అంటే కేవలం శృంగారమే కాదు అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయని తమన్నా హామీ ఇస్తున్నారు.
ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. లస్ట్ స్టోరీస్ 2 లో శృంగారంతో పాటు ఎమోషన్, డ్రామా, రొమాన్స్, యాక్షన్ ఉన్నాయి. అలాగే అమ్మ ప్రేమ, నాన్నమ్మ ప్రేమ, ఎక్స్ ప్రేమ, వై ప్రేమ... ఎన్నో ఉన్నాయి. కేవలం టైటిల్ చూసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. టెన్షన్ తీసుకోవద్దు. లస్ట్ స్టోరీస్ 2 చూస్తే ఏదో ప్రళయం వచ్చేస్తుంది అన్నట్లు ఫీల్ కావద్దు. ప్రశాంతంగా లస్ట్ స్టోరీస్ 2 చూసి ఎంజాయ్ చేయండి... అని చెప్పుకొచ్చారు.
లస్ట్ స్టోరీస్ 2 లో విజయ్ వర్మతో తమన్నాకు బోల్డ్ సీన్స్ ఉన్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ లో విజయ్ వర్మకు తమన్నా దగ్గరయ్యారట. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఈ ప్రాజెక్ట్ షూట్లోనే అట. తమన్నా, విజయ్ వర్మ మధ్య ఎఫైర్ నడుస్తుందని కొన్నాళ్లుగా కథనాలు వెలువడుతున్నాయి. ఫైనల్ గా ఇద్దరు అవును నిజమంటూ ధృవీకరించారు.
అలాగే తమన్నా భోళా శంకర్, జైలర్ చిత్రాల్లో నటిస్తోంది. చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. ఇక రజినీకాంత్ కి జంటగా నటించిన జైలర్ సైతం ఇదే సీజన్లో విడుదలకు సిద్దమవుతుంది. కెరీర్లో మొదటిసారి తమన్నా రజినీకాంత్ తో జతకట్టారు.