బాలీవుడ్ బిగ్ బాస్ లో బరితెగింపు.. ఆ నటుడిని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Published : Jun 27, 2023, 01:50 PM ISTUpdated : Jun 27, 2023, 02:12 PM IST
బాలీవుడ్ బిగ్ బాస్ లో బరితెగింపు.. ఆ నటుడిని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

సారాంశం

బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. ఈ మధ్య వల్గారిటీకి కూడా సెంటర్ పాయింట్ అవుతోంది బిగ్ బాస్ షో. మరీ ముఖ్యంగా హిందీ బిగ్ బాస్ లో భరితెగించేస్తున్నారు తారలు. 


బిగ్ బాస్ అంటేనే ఫ్యామిలీతో చూసే ప్రోగ్రామ్. కాని ఈమధ్య ఈ బిగ్ బాస్ షో.. వివాదాలకు, వికృత చేష్టలకు అడ్డాగా మారుతోంది.  మరీ ముఖ్యంగా బాలీవుడ్ బిగ్ బాస్ ప్రోగ్రామ్ మరీ ధారుణంగా తయారవుతోంది. తాజాగా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 నడుస్తోంది. జీయోలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ఓటీటీ 2 లో ధారుణాలుచోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా హౌస్ లో ఉన్నవారి మధ్య టాస్క్ ల వేడి పెరుగుతూ.. హోరా హోరీ పోటీలు ఉండేవి. కాని రాను రాను టాస్క్ ల వేడి కంటే కూడా.. మరో రకంగా కూడా హీటెక్కిస్తున్నారు కంటెస్టెంట్లు. 

అంత పెద్ద హౌస్ లో లైవ్ కెమెరాలు ఉన్నాయన్న ఆలోచన కూడా లేకుండా కొంత మంది కంటెస్టెంట్స్ చేస్తున్న పనులు.. చూసేవారికి చిరాకు తెప్పిస్తున్నాయి. ఈ సీజన్ లో బాలీవుడ్ నటుడు జాద్ హదీద్.. చేస్తున్న పనికి హౌస్ అంతటికి చెడ్డపేరు వచ్చేలా ఉంది. ఇదే హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్న దుబాయ్ కి చెందిన మోడల్ ఆకాంక్ష పూరి తో జాద్ ప్రవర్తన అసభ్య కరంగా ఉంది. అంత మంది ఉన్నారని చూడకుండా ఆమె వెనకాల పడుతూ.. టచ్ చేయాలని ప్రయత్నిస్తుండగా.. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. 

బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి.. ఆకాంక్ష పూరీ పట్ల జాద్ ప్రవర్తన తేడాగానే ఉంది. తాజాగా కెమెరాలు.. లైవ్ నడుస్తుండగా  ఆకాంక్ష నడుము పట్టుకుని దగ్గరకు లాక్కోవడానికి ప్రయత్నించాడు. అటు ఆకాంక్ష పూరీ ఈ విషయంలో ఇబ్బంది పడుతూ.. అతనికి దూరంగా జరగడానికి ప్రయత్నిస్తుంది. జాద్ ను మొదటి నుంచి దూరం పెట్టడానికి ఆమె ట్రై చేస్తుంది. అయినా కాని అతని ప్రవర్నపై హౌస్ లోనే కాదు.. బయట కూడా అంతా కోపంగానే ఉన్నారు. 

 

ఇక ఈ విషయంలో నెటిజన్లు జాద్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అదేపని.. ఈ విషయంలో ఎవరూ చర్చలు తీసుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలంటూ.. కామెంట్లు పెడుతున్నారు. ఇంత మంది చూస్తున్న షోలో అతను ఇలా చేయడం పద్దతి కాదు అంటూ చీవాట్లు పెడుతున్నారు. మరి ఈ విషయంలో సల్మాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ రెండు రోజుల కలెక్షన్లు.. రెండో రోజు పడిపోయిన బాలయ్య సినిమా వసూళ్లు..
జూనియర్ ఎన్టీఆర్ కు ఇరిటేషన్ తెప్పించి, బీపీ పెరిగిపోయేలా చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా? తారక్ ఏం చేశాడంటే?