మణిరత్నం రేంజ్ ఇంతలా పడిపోయిందే..!

By Udayavani DhuliFirst Published Sep 26, 2018, 10:43 AM IST
Highlights

ఒకప్పుడు మణిరత్నం సినిమా అంటే ప్రేక్షకులను పడిపడి చూసేవారు. బయ్యర్లు సినిమా కొనడానికి పోటీ పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఆయన సినిమాలపై ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 

ఒకప్పుడు మణిరత్నం సినిమా అంటే ప్రేక్షకులను పడిపడి చూసేవారు. బయ్యర్లు సినిమా కొనడానికి పోటీ పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఆయన సినిమాలపై ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

బయ్యర్లు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. సినిమా సినిమాకి బయ్యర్లు మారుతున్నారే తప్ప మణిరత్నంకి సరైన హిట్ మాత్రం రాలేదు. 'ఓకే బంగారం' సినిమా ఓకే అనిపించినా.. మణిరత్నం స్టాండర్డ్ సినిమా కాదని తేల్చేశారు. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేసిన 'నవాబ్' సినిమాకు తెలుగునాట ఎలాంటి బజ్ లేకుండా పోయింది.

రేపు సినిమా విడుదలవుతుందన్న సంగతి కూడా జనాలకు చేరువ కాలేదు. పైగా 'దేవదాస్' సినిమాపై క్రేజ్ ఉండడంతో ఆ సినిమాకు పోటీగా విడుదలవుతున్న 'నవాబ్' పై జనాల దృష్టి పెద్దగా కనిపించడం లేదు.

సరైన ప్రమోషన్స్ లేకపోవడం కూడా సినిమాకి మైనస్ అయింది. సినిమా విడుదలైన తరువాత గనుక బావుందని టాక్ వస్తే.. అప్పుడు సినిమా పుంజుకునే ఛాన్స్ ఉంది. లేదంటే సినిమా పరిస్థితి అంతే..   

click me!