నాగ్ లో ఉన్న చెడు లక్షణాల లిస్ట్.. నాని మాటల్లో!

By sivanagaprasad kodatiFirst Published Sep 26, 2018, 10:04 AM IST
Highlights

నాగార్జున, నాని కలిసి నటించిన 'దేవదాస్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఇద్దరు హీరోలు, హీరోయిన్లు యాక్టివ్ గా మీడియా ముందుకు వస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఇప్పటికే నాగార్జున.. నాని ఫోన్ పర్సన్ అని తన పక్కన అందమైన అమ్మాయి ఉన్నా.. ఫోన్ చూస్తూ ఉంటాడని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నాని.. నాగార్జున ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఇవే అంటూ ఓ వీడియో విడుదల చేశాడు.

ఆ వీడియోలో నాని మాట్లాడుతూ..''నాగ్ పొద్దు పొద్దునే లేస్తారు, టైమ్ కి షూటింగ్‌కు వస్తారు, టైమ్ కి తింటారు, లంచ్‌ బ్రేక్‌ తర్వాత కూడా టైమ్‌కే వస్తారు. సమయానికి షూటింగ్‌ నుంచి వెళ్లిపోతారు. ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తారు.

అలా అని లైఫ్‌ను ఎంజాయ్‌ చేయకుండా ఉంటారా? లేదు.. ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తారు. ట్రిప్‌లకు వెళ్తారు. అన్ని ప్లానింగ్ తో చేస్తారు.. ఇవన్నీ చెడు లక్షణాలే. నాకు తెలిసి 2019 న్యూ ఇయర్‌కు ఎక్కడికి వెళ్లాలి, ఏం చేయాలి అనే విషయాల్ని ఆయన ఇప్పటికే ప్లాన్‌ చేసుకుని ఉంటారు. ఇంత ప్లానింగ్‌తో, ఇంత పర్‌ఫెక్ట్‌గా మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా ఉంటే వెంటనే ట్యాగ్‌ చేయండి'' అంటూ తెలిపారు.

click me!