
ఒక సినిమా హిట్ అవ్వాలంటే పెద్ద బడ్జెట్, స్టార్ నటులు ఉండాల్సిన పనిలేదు అని చాలా సినిమాలు తప్పని నిరూపించాయి. కొన్ని సినిమాలకి 500 నుంచి 600 కోట్ల దాకా బడ్జెట్ పెడుతుంటారు. సినిమా హిట్ అయ్యి.. ఆడియన్స్ కు నచ్చితే, అంత డబ్బులు పెట్టి తీసే సినిమాలు వెయ్యి కోట్ల దాకా కలెక్ట్ చేస్తాయి.
Also Read: సాయి పల్లవి వాడే రెండే రెండు మేకప్ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా?
కానీ కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్‌లో తీసి నాలుగైదు రెట్లు లాభం తెచ్చుకుంటాయి. అందుకే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలు కూడా వీటి ముందు తల దించాల్సిందే. ఇవాళ మనం చెప్పుకోబోయే సినిమా తక్కువ బడ్జెట్‌లో తీసి సినిమా రంగంలోనే టాప్ అవార్డు కొట్టేసింది.
కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డబ్బులు తెచ్చుకోలేకపోయినా చాలా అవార్డులు గెలుచుకుని సినిమా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తాయి. కొన్ని సినిమాలు పెట్టిన డబ్బులతో మూడొంతులు, నాలుగొంతులు లాభం తెచ్చుకుంటాయి. అలాగే దేశ విదేశాల్లో టాప్ అవార్డులు కూడా సొంతం చేసుకుంటాయి.
ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయేది కూడా అాంటి సినిమానే. అదే అనోరా (Anora) సినిమా. ఈసినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి.. పెట్టిన బడ్జెట్ కు 6 రెట్లు లాభం తెచ్చుకుని రికార్డు సృష్టించింది. అవార్డులు గెలుచుకోవడంలో చాలా మంచి సినిమాల్ని కూడా వెనక్కి నెట్టేసింది. చాలా తక్కువ బడ్జెట్ 52 కోట్లతో (60 లక్షల డాలర్లు) తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 358 కోట్ల రూపాయలు (41 మిలియన్ డాలర్లు) కలెక్ట్ చేసింది.
Also Read:రోజా భర్త మాటలు విని కోట్లు నష్టపోయిందా.?
అంతే కాదు ఈసినిమా ఏకంగా 5 ఆస్కార్ అవార్డ్ లు సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్చపరిచింది. 97వ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో సీన్ బేకర్ తీసిన అనోరా సినిమా మ్యాజిక్ చేసింది. ఈ సినిమా ఐదు వేర్వేరు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. అనోరా సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ చిత్రకథ, ఉత్తమ నటి, ఆధారిత సంకలనం, ఉత్తమ దర్శకత్వం కోసం ఆస్కార్ అవార్డులు అందుకుంది.
ఇన్ని అవార్డులు రావడన్ని బట్టి చెప్పవచ్చు సినిమా కథ, నటీనటుల నటన ఎంత అద్భుతంగా ఉందో ఊహించుకోవచ్చు.సీన్ బేకర్ రాసి దర్శకత్వం వహించిన అనోరా కామెడీ, రొమాంటిక్ సినిమా. సీన్ బేకరే సినిమాకి డబ్బులు పెట్టాడు. అమెరికా అమ్మాయి ఒక రష్యన్ కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఆసక్తి కరంగా ఉంటుంది. సినిమాలో కుటుంబ కథాంశాలు ఉంటాయి. అనోరా సినిమా గత సంవత్సరం 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొదటిసారిగా ప్రదర్శించారు.
Also Read: నోరుజారి అడ్డంగా బుక్ అయిన చిరంజీవి