మహేష్ థియేటర్ లో కోటి వసూలు, ప్రకటన వెనక కారణం?

By Surya PrakashFirst Published Oct 21, 2021, 7:38 AM IST
Highlights

ఏసియన్ సినిమాస్‌తో కలిసి సూపర్ స్టార్ మహేష్‌బాబు నిర్మించిన మల్టీప్లెక్స్ ‘ఏఎంబీ సినిమాస్’ .  ఈ మల్టీప్లెక్స్‌ ని కొండాపూర్‌లోని కొత్తగూడ బొటానికల్ గార్డెన్ పక్కన గచ్చిబౌలి వెళ్లే రోడ్డులో అధునాతన హంగులతో నిర్మించారు.

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైంది. తొలి వీకెండ్ అదిరిపోయే రెస్పాన్స్ కనబరిచిన ఈ చిత్రం తర్వాత డ్రాప్ అవటం మొదలెట్టింది. అయితేనేం ఫైనల్ గా సేఫ్ వెంచర్ గా నిలిచింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో కూడా లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా లవ్ స్టోరీ ఇప్పుడు మరో రికార్డ్ ను సృష్టించింది.

ఇక మహేష్ కో-ఓనర్ గా ఉన్న ఏఎంబి సినిమాస్ హైదరాబాద్ లోనూ ఈ సినిమా రికార్డ్ లు క్రియేట్ చేసింది. లవ్ స్టోరీ చిత్రం ఏఎంబి సినిమాస్ లో కోటి రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. ఏఎంబి సినిమాస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. “మొత్తం 251 షోస్ ద్వారా 48,233 ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడటం ద్వారా లవ్ స్టోరీ 1 కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది” అని మేనేజ్మెంట్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. అయితే మొత్తం కలెక్షన్స్ గురించి చెప్పకుండా మహేష్ థియోటర్ గురించి చెప్పటం ఏమిటి అంటే ఈ థియోటర్స్ లో షేర్ ..ఏషియన్ వాళ్లకు ఉంది. వాళ్ల సినిమా వాళ్ల థియోటర్ లో బాగా ఆడి కలెక్ట్ చేసిందని చెప్పటం కావచ్చు అంటున్నారు. 

Also read ప్రభాస్ ని బాగా స్టడీ చేసిందిగా.. ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ బయటపెట్టిన కృతి సనన్

సెకండ్‌ వేవ్ తర్వాత వచ్చిన పెద్ద సినిమా అవ్వడం వల్ల ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్  భారీగా ఉన్నాయి. దానికి తోడు ఫిదా కాంబో అవ్వడం వల్ల కూడా ప్రేక్షకులు ఈ సినిమాను చూడాలని కోరుకున్నారు.  లవ్‌ స్టోరీ ట్రైలర్ విడుదల తర్వాత సినిమా రేంజ్ అమాంతం పెరిగింది. ఇది మన కథ.. మన చుట్టు కనిపించే కథ అన్నట్లుగా సినిమా ఉంటుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఎదురు చూశారు. వారి నమ్మకాన్ని సినిమా నిలబెట్టింది. లవ్ స్టోరీ సినిమా కథ సామాజిక అంశంను టచ్ చేస్తూ చూపించడం జరిగింది. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కమర్షియల్‌ గా తీయడం అంటే సాహసమే. అయితే దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన మార్క్ తో సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు.
 

, Success Stories! On an average of 251 shows with an audience of 48,233 bringing in a gross collection of Rs. 1 crore has created a huge success story in itself! We congratulate the team for their hardwork and success! pic.twitter.com/h3HNY2nXAd

— AMB Cinemas (@amb_cinemas)
click me!