
శరత్‌బాబు తన అవసరం కోసమే రమాప్రభను పెళ్లి చేసుకున్నారని, ఆమెను అన్ని విధాలుగా ఉపయోగించుకున్న తరవాత నడిరోడ్డుపై వదిలేశారని ఇప్పటికీ చాలా మంది అంటుంటారు. దీనికి కారణం రమాప్రభ స్వయంగా ఈ విషయాలన్నీ చెప్పడమే. ఇప్పటి వరకు ఆమె మీడియాకు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రతి ఇంటర్వ్యూలో శరత్‌బాబుపై చాలా ఆరోపణలు చేశారు. కానీ, వాటిపై ఎప్పుడూ శతర్‌బాబు స్పందించలేదు. అసలేం జరిగింది.
శరత్ బాబు కొద్దిసేపటి క్రితమే అనారోగ్యంతో మరణించారు. ఈ టైంలో ఇది సరైన టాపిక్ కాదు. కానీ ఇప్పుడు ఇదే హఠాత్తుగా వైరల్ అవుతోంది. ఆయన గురించి అందరూ మాట్లాడటం మొదలెట్టారు. వెకటి తరం హీరోయిన్ అయిన రమాప్రభ.. సీనియర్ హీరో శరత్ బాబు ప్రేమాయణం… పెళ్లి ఇండస్ట్రీలో అప్పట్లో సంచలనం రేపింది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవటం మామూలు విషయమే అయినా… వయసులో శరత్ బాబు కంటే రమాప్రభ చాలా పెద్దది. అయినా కూడా శరత్ బాబు అంటే ఆమె విపరీతమైన ప్రేమతో ఉండేవారని చెప్తారు. అసలు ఆమె వైపు నుంచే ప్రేమ మొదలైందని అంటారు. ముందుగా ఆమె శరత్ బాబుని ప్రేమించిందని చెప్పుకునేవారు. వీరిద్దరి ప్రేమ పెళ్లి గురించి అప్పట్లో శరత్‌బాబు రూమ్మేట్ గా ఉన్న సీనియర్ జర్నలిస్టు వెంకటేశ్వరరావు మనకు తెలియని విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆయన మాటల్లో చెప్పినదేమిటంటే... అప్పట్లో శరత్ బాబు జర్నలిస్టు వెంకటేశ్వరరావు – సింగర్ ఆనంద్ బాబు కలిసి ఒకే రూమ్ లో ఉండేవారట. అప్పుడు శరత్ బాబు అప్ కమింగ్ హీరో. ఒకటి.. రెండు సినిమాల్లో మాత్రమే హీరోగా చేసి ఆ తర్వాత చాలా సినిమాల్లో సెకండ్ హీరో పాత్రలు వేసుకుంటున్నారు. అప్పటికే రమాప్రభ పెద్ద హీరోయిన్. స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు కొట్టిన ఆమెకు మంచి పాపులారిటీ ఉంది. తనకంటే వయసులో చిన్న వాడు అయిన శరత్‌బాబు అంటే ఇష్టం పెంచుకున్న రమాప్రభ ప్రతిరోజు శరత్ బాబు రూమ్‌కి వచ్చి ఆయన్ను తన కారులో తీసుకుని వెళ్లేవారట.
అలా ముందుగా శరత్ బాబును రమాప్రభ ప్రేమించగా… ఆ తర్వాత శరత్ బాబు కూడా అనేక అవసరాలతో పాటు రమాప్రభ రికమండేషన్ తో సినిమాల్లో ఛాన్సులు రావడంతో ఆమెకు దగ్గర అయ్యారట. చివరకు శరత్ బాబును హీరోగా ప్రమోట్ చేసేందుకు రమాప్రభ నిర్మాతగా మారి… శరత్ బాబు హీరోగా వింత ఇల్లు సొంత గోల అనే సినిమా కూడా తీశారు. రమాప్రభ అండతో శరత్ బాబు హీరోగా మంచి మంచి అవకాశాలు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత శరత్ బాబు రమాప్రభని పెళ్లి చేసుకుని ఆ రూము ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని వెంకటేశ్వరరావు చెప్పారు.
రమాప్రభ – శరత్‌బాబు పెళ్లి చేసుకొని కొన్నేళ్లపాటు సంసార జీవితం చేసిన తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వారు విడాకులు తీసుకున్నారు. శరత్ బాబుతో విడాకులు తర్వాత చాలా సందర్భాల్లో రమాప్రభ.. శరత్ బాబు తనను అన్ని విధాల వాడుకొని మోసం చేశారని ఆరోపించారు. చివరకు శరత్ బాబు పేరు కూడా తలిచేందుకు ఆమె ఇష్టపడేవారు కాదు. ప్రస్తుతం రమాప్రభ చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఉంటున్నారు. శరత్ బాబు చెన్నైలో ఉంటూ వచ్చారు.