Lock Upp- Saisha Shinde: ప్రముఖ డిజైనర్ నాతో బెడ్ షేర్ చేసుకున్నాడు... ట్రాన్స్ జెండర్ సాయేషా సంచలన కామెంట్స్ 

Published : May 03, 2022, 05:33 PM IST
Lock Upp- Saisha Shinde: ప్రముఖ డిజైనర్ నాతో బెడ్ షేర్ చేసుకున్నాడు... ట్రాన్స్ జెండర్ సాయేషా సంచలన కామెంట్స్ 

సారాంశం

ప్రముఖ రియాలిటీ షో లాక్ అప్ సంచలనాలకు వేదికగా మారింది. కంటెస్టెంట్స్ టాస్క్స్ లో భాగంగా తమ జీవితంలో చోటు చేసుకున్న చీకటి అనుభవాలు, ప్రైవేట్ విషయాలు షేర్ చేస్తున్నారు. తాజాగా ట్రాన్స్ జెండర్ సాయేషా ఓ ప్రముఖ డిజైనర్ తో బేస్ షేర్ చేసుకున్నట్లు ఓపెన్ అయ్యింది.

కంగనా హోస్ట్ గా లాక్ అప్ (Lock upp) రియాలిటీ షో ఉత్కంఠగా సాగుతుంది. ఈ షో చివరి దశకు చేరుకుంది. ఓటిటిలో ప్రసారం అవుతున్న లాక్ అప్ షో మంచి ఆదరణ దక్కించుకుంటుంది. కాగా ఈ షోకి ట్రాన్స్ జెండర్ గా ఎంట్రీ ఇచ్చిన సాయేషా షిండే(Saisha Shinde) తన జీవితంలో జరిగిన  షాకింగ్ సంఘటన షేర్ చేసుకుంది. కెరీర్ బిగినింగ్ లో ఓ ప్రముఖ డిజైనర్ తనను హోటల్ గదికి పిలిచాడని, ఆ క్రమంలో అతనితో బెడ్ షేర్ చేసుకున్నట్లు వెల్లడించింది. లాక్ అప్ షోలో ఆమె మాట్లాడుతూ  'కెరీర్‌ ఆరంభించిన తొలినాళ్లలో ఈ సంఘటన జరిగింది. అది 2006 అనుకుంటా ఆ ఇండియన్‌ డిజైనర్‌  నా ఫేవరెట్‌. అతడిని కలిసినప్పుడు నేను అట్రాక్ట్ అయ్యాను. ఓసారి నన్ను హోటల్‌ గదికి పిలిచాడు, వెళ్లాను. డబ్బులు, స్టేటస్ ఉన్నా తనకు ప్రేమను పంచేవాళ్లే కరువయ్యారని బాధపడ్డాడు. నేను అతడిని ఓదార్చుతూ హగ్‌ చేసుకున్నా.. అలా ఇద్దరం బెడ్‌ షేర్‌ చేసుకున్నాం. 

ఆ తర్వాత కూడా అతనితో టచ్‌లో ఉన్నా. కానీ కొద్దిరోజులకే నాకు తెలిసిందేంటంటే.. నా ఫ్రెండ్స్‌కి కూడా ఇలాగే బాధలో ఉన్నాడంటూ కహానీలు చెప్పి ఏడెనిమి మంది అబ్బాయిలతో హోటల్‌లో బస చేశాడట.ఈ వార్త బయటకు పొక్కడంతో నన్ను ఇండస్ట్రీ నుంచి బ్యాన్‌ చేశారు. నేనే అతడి గురించి అంతటా చాటింపు చేస్తున్నాను అనుకుని ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొనడానికి వీల్లేకుండా నిషేధం విధించారు. నిజానికి నేను ఎవరికీ చెప్పలేదు' అని సాయేషా తెలిపింది. దీనిపై కంగనా స్పందిస్తూ 'ఇండస్ట్రీలో జరిగేది ఇదే. మీటూ ఉద్యమం సమయంలో కూడా ఇలాగే జరిగింది. ఎంతోమంది అమ్మాయిలు తమ వేధింపుల గురించి బాహాటంగానే ప్రస్తావించారు. ఇండస్ట్రీలో పేరున్న వ్యక్తుల పేర్లను బయటపెట్టారు. కానీ ఎవరైతే అలా ముందుకువచ్చి మాట్లాడారో వాళ్లందరూ కనిపించకుండా పోయారు, కానీ వేధించినవాళ్లు మాత్రం ఇండస్ట్రీలో ఇంకా కొనసాగుతున్నారు. మీటూ ఉద్యమానికి మద్దతు పలికినందుకు నన్ను కూడా చిత్రపరిశ్రమలో బ్యాన్‌ చేశారు' అని చెప్పుకొచ్చింది. 

సాయేషా కెరీర్ నాశనం చేసిన ఆ డిజైనర్ పేరు మాత్రం ఆమె చెప్పలేదు.ఇక హోస్ట్ గా కంగనా (Kangana Ranaut)సూపర్ సక్సెస్ అని చెప్పాలి. సల్మాన్ బిగ్ బాస్ షోకి సవాలు విసిరిన కంగనా చాలా వరకు సక్సెస్ అయ్యారు. బోల్డ్ కంటెంట్ తో సాగిన ఈ రియాలిటీ షో సక్సెస్ సాధించింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఈ షోకి నిర్మాతగా ఉన్నారు.  కాగా లాకప్‌ షో గ్రాండ్‌ ఫినాలే మే7న జరగనుంది. ఈ క్రమంలో వచ్చే ఆదివారం విజేత ఎవరో తేలిపోనుంది. ఆల్ట్ బాలాజీ, ఎమ్ఎక్స్ ప్లేయర్ లో లాక్ అప్ షో ప్రసారం అవుతుంది. మరోవైపు కంగనా లేటెస్ట్ మూవీ ధాకడ్ మూవీ ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ధాకడ్ మే 20న విడుదల కానుంది. 
 

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే