డిజాస్టర్ టాక్ తో  బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన లైగర్!

Published : Aug 27, 2022, 03:06 PM IST
డిజాస్టర్ టాక్ తో  బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన లైగర్!

సారాంశం

ఫస్ట్ షో నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న లైగర్ వసూళ్ల పరంగా పర్లేదు అనిపించింది. హిందీలో ఈ మూవీ ఏకంగా బాహుబలి రికార్డు బ్రేక్ చేసి షాకిచ్చింది.   

ఒకరోజు ఆలస్యంగా లైగర్ హిందీ వెర్షన్ విడుదల చేశారు. అయితే అక్కడక్కడ ప్రీమియర్స్ ప్రదర్శన జరిగింది. ప్రీమియర్స్ ద్వారా ఈ చిత్రానికి రూ. 1.25 కోట్లు నెట్  వసూళ్లు దక్కాయి. ఇక ఓపెనింగ్ డే శుక్రవారం రూ.4.5 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి రూ. 5.75 కోట్లు కలెక్షన్స్ దక్కినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. ఇది బాహుబలి 1 ఓపెనింగ్ డే రికార్డు కంటే అధికం కావడం విశేషం. బాహుబలి పార్ట్ 1 హిందీ వర్షన్ రూ.5.15 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. అయితే లైగర్ ప్రీమియర్స్ కలుపుకొని ఆ రికార్డు బ్రేక్ చేసింది. ఇక   డబ్బింగ్ చిత్రాల్లో కెజిఎఫ్ 2(53.95 కోట్లు), బాహుబలి 2(41 కోట్లు) వసూళ్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.     

ఫస్ట్ షో నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఆ మాత్రం వసూళ్లు సాధించడం విశేషం. హిందీ వర్షన్ భారీగా నష్టాలు మిగల్చకపోవచ్చు. ఎందుకంటే ఎంత హైప్ క్రియేట్ చేసినా సినిమా పెద్ద మొత్తానికి కొనలేదు. అంటే ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా లైగర్ హిందీలో మంచి లాభాలు పంచేది. 

తెలుగుతో పాటు మిగతా భాషల్లో లైగర్ బయ్యర్లు భారీగా నష్టపోవడం ఖాయం. రెండో రోజు దారుణంగా లైగర్ వసూళ్లు పడిపోయాయి. ఓపెనింగ్ డే రూ. 9.57 కోట్ల షేర్ రాబట్టి లైగర్ విజయ్ కెరీర్ బెస్ట్ నమోదు చేసింది. ఇది టైర్ టూ హీరోల్లో రికార్డు ఓపెనింగ్ కలెక్షన్స్. అయితే సెకండ్ డే కేవలం రూ. 1.54 కోట్ల షేర్ కి పరిమితమైంది. లాంగ్ వీకెండ్ ఉన్నప్పటికీ లైగర్ సేవ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. తెలుగు  రాష్ట్రాల్లో ఈ మూవీ కనీసం రూ. 40 కోట్ల నష్టాలు మిగిల్చే అవకాశం కలదు.  

PREV
click me!

Recommended Stories

Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?
Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు