
కొరియోగ్రాపర్, డైరెక్టర్, హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై శివలింగ ను తెరకెక్కిస్తున్న చిత్రం `శివలింగ`.రితిక హీరోయిన్‌గా నటిస్తుంది. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ నటించిన కన్నడ సూపర్‌హిట్ మూవీ శివలింగ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. సినిమాను ఫిబ్రవరి లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. హార్రర్ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్ లొ ఉండే చిత్రమని అన్నారు.
రాఘవలారెన్స్, రితిక సింగ్, వడివేలు, శక్తివాసు, రాధారవి, జయప్రకాష్, ప్రదీప్ రావత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సర్వేష్ మురారి. మ్యూజిక్ః ఎస్.ఎస్.థమన్, సాహిత్యంః రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ః దురైరాజ్, ఫైట్స్ః అనల్ అరసు, దినేష్, ఎడిటింగ్ః సురేష్, నిర్మాతః రమేష్.పి.పిళ్లై