క్షమాపణ చెప్పకపోతే చంపేస్తాం.. సల్మాన్ ఖాన్ కు లైవ్ లో వార్నింగ్ ఇచ్చిన లారెన్స్ బిష్ణోయ్

Published : Mar 16, 2023, 07:51 AM IST
క్షమాపణ చెప్పకపోతే చంపేస్తాం.. సల్మాన్ ఖాన్ కు లైవ్ లో వార్నింగ్ ఇచ్చిన లారెన్స్ బిష్ణోయ్

సారాంశం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు తిప్పలు తప్పడంలేదు. వివాదాలు వదలడం లేదు. కోర్ట్ నుంచి క్లియరెన్స్ వచ్చినా..? బయట నుంచి బెదిరింపులు నిద్రలేకుండా చేస్తున్నాయి బాలీవుడ్ స్టార్ హీరోను. 

కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ సినిమాతో మాస్ ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నాడు  బాలీవుడ్ స్టార్ హీరో.. కండల వీరుడు సల్మాన్ ఖాన్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈసినిమాపై సల్మాన్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని బాలీవుడ్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈక్రమంలో సల్మాన్ సినిమాలు ఎంత పాపులర్ అవుతాయో.. ఆయన చేసే పనులు కూడా అంతే వివాదం అవుతాయి. ఇప్పటికే సల్మాన్ పై చాలా వివాదాలు ఉన్నాయి. అందులో కృష్ణ జింకలను వేటాడిన కేసు కూడా ఒకటి. ఈ కేసు గురించి ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరిగాడు సల్లూ భాయి. అయితే రీసెంట్ గా ఆయనకు ఈకేసు నుంచి ఊరట లభించింది. కాని ఈ విషయంలో మనశాంతి మాత్ర కరువయ్యింది. 

కృష్ణ జింకలు బిష్ణోయ్ తెగవారికి ఆరాధ్య దైవం. ఈ విషయంలో సల్మాన్ పై వారు పట్టరాని కోపంగా ఉన్నారు. దాంతో ఈ విషయంలో ఆయనకు తిప్పలు తప్పడం లేదు. కృష్ణ జింకలను కులదైవంగా పూజించే బిష్ణోయ్ తెగ ప్రజలు సల్మాన్​పై మండిపడుతున్నారు. అంతే కాదు రీసెంట్ గా  సల్మాన్​పై ఈ తెగకు సబంధించిన గ్యాంగ్​స్టర్ లారెన్స్ బిష్ణోయ్​ హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.   ఈ కేసులో ఆయన  జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నాడు. అయితే జైల్లో ఉండి కూడా సల్మాన్ పై తన కోపాన్ని ప్రదర్శించాడు లారెన్స్. 

ఈ మధ్య  ఒక టీవీ చానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ పై మరోసారి  బెదిరింపులకు దిగాడు లారెన్స్ బిష్ణోయ్. సల్మాన్‌ మీద తమవారంతా కోపంతో ఉన్నారని .. అతను తమను తమ దైవాన్ని అవమానించాడని.. అందుకే అతనిపై అంతా తీవ్ర ఆగ్రహం ఉన్నారని తెలిపారు లారెన్స్ బిష్ణోయ్. అంతే కాదు సల్మాన్​ను జోధ్​పూర్​లోనే చంపుతానని  లైవ్ లో వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక సల్మాన్ ను వదిలిపెట్టాలి అంటే.. అతను తమ కులదైవం ఆలయాన్ని దర్శించుకుని.. తమ వారికి క్షమాపణ  చెబితే వదిలేస్తామని లారెన్స్ బిష్ణోయ్ స్పష్టం చేశాడు. 

గ్యాంగ్ స్టర్ లారెన్స్ వార్నింగ్ ప్రస్తుతం సంచలనంగా మారింది. గ్యాంగ్ స్టార్ అయిన లారెన్స్  గతేడాది మేలో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను హత్య చేశారు. ఈ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది తమ పనేనంటూ లారెన్స్‌ బిష్ణోయ్ ముఠా సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. దీంతో లారెన్స్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. సల్మాన్ ను చంపేస్తాము అని బెదిరించడంతో.. స్టార్ హీరోకు సెక్యూరిటీని పెంచింది ప్రభుత్వం.  మరి ఈ విషయంలో సల్మాన్ ఖాన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. 


 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?