లారెన్స్ అసలైన హీరో.. 150వ సర్జరీ సక్సెస్!

Published : Oct 29, 2018, 06:49 PM IST
లారెన్స్ అసలైన హీరో.. 150వ సర్జరీ సక్సెస్!

సారాంశం

డ్యాన్స్ మాస్టర్ గా నటుడిగా అలాగే డైరెక్టర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ గురించి స్పెషల్ గా ఇంకేమి చెప్పనవసరం లేదు.

డ్యాన్స్ మాస్టర్ గా నటుడిగా అలాగే డైరెక్టర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ గురించి స్పెషల్ గా ఇంకేమి చెప్పనవసరం లేదు. కేవలం తన మంచి టాలెంట్ తోనే కాకుండా మంచి హృదయంతో అభిమానులకు దగ్గరగా ఉండే ఒక సెలబ్రెటీ రాఘవ. ఎంతో మంది అనాథలను ఆదరిస్తూ చిన్నారుల అనారోగ్య సమస్యలను తీరుస్తున్నాడు. 

ముఖ్యంగా  చిన్నారుల హార్ట్ సర్జరీలను చేయించడంలో ఎనలేని కీర్తిని పొందాడు ఈ డ్యాన్స్ మాస్టర్. రీసెంట్ గా చిన్నారికి 150వహార్ట్ సర్జరీ చేయించినట్లు చెబుతూ తనకు ఎంతో సంతోషంగా ఉందని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే 150వ ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతమయ్యింది. కావ్య శ్రీ అనే చిన్నారికి సర్జరీ బాగా జరిగింది అన్నారు. 

ఇక డాక్టర్లందరికి ధన్యవాదాలని తెలుపుతూ ఎవరైనా డబ్బు చెల్లించలేని వారు హృదయ సంబంధింత ప్రాబ్లమ్స్ తో బాధపడితే లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించాలని లారెన్స్ ఫోన్ నెంబర్స్(09790750784, 09791500866) ఇచ్చారు. ఇక ట్వీట్ చూసిన అభిమానులు లారెన్స్ నిజమైన హీరో అంటూ అందరికి ఈ మెస్సేజ్ ను ఫార్వార్డ్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది