రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' టీజర్!

Published : Oct 29, 2018, 04:54 PM IST
రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' టీజర్!

సారాంశం

మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల 'అమర్ అక్బర్ ఆంటోనీ' అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం

మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల 'అమర్ అక్బర్ ఆంటోనీ' అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా  కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది.

తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. 'ముగింపు రాసుకున్న తరువాతే కథ మొదలుపెట్టాలి' అని విలన్‌ చెప్పే మాటలు.. 'మనకు నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉండే బలం..' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్‌లు టీజర్‌కు హైలెట్‌ గా నిలిచాయి. 

ఇలియానా కాస్త బొద్దుగా కనిపిస్తున్నా.. అందంగానే కనిపించింది. టీజర్ ని బట్టి ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రల్లో కనిపించబోతున్నారనే విషయం  తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాని మంచి క్వాలిటీతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సునీల్, లయ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Emmanuel: బిగ్‌ బాస్‌ షోకి వెళ్తే కామెడీ చేయకండి.. ఇమ్మాన్యుయెల్‌ సంచలన కామెంట్‌.. అందరి ముందు అసహనం
2025లో బెస్ట్ మూవీస్ లో ఒకటి, ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ప్రకటించిన డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి..