లావణ్య విత్ లవ్‌బాయ్స్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ!

Published : May 06, 2017, 04:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
లావణ్య విత్ లవ్‌బాయ్స్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ!

సారాంశం

సాంబ, యోధ, కిరణ్, పావని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం లావణ్య విత్ లవ్‌బాయ్స్ డా.వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈ చిత్రం మోషన్ పోస్టర్ ఆవిష్కరణ  

సాంబ, యోధ, కిరణ్, పావని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం లావణ్య విత్ లవ్‌బాయ్స్. డా.వడ్డేపల్లి కృష్ణ దర్శకుడు. రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రాజ్యలక్ష్మి, సి. నర్సింలుపటేల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను రాష్ట్ర ఆర్‌టిఐ ఛైర్మన్ విజయబాబు శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గేయ రచయితగా మంచి పేరుతెచ్చుకున్న వడ్డేపల్లి కృష్ణ చాలా కాలం తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అనుకున్న బడ్జెట్‌లో అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేసి ఆశ్చర్యాన్ని కలిగించారు. చిన్న సినిమా అయినా అందులో విషయం వుంటే పెద్ద విజయాన్ని సాధిస్తుంది. చిన్న చిత్రాల్ని బ్రతికించడానికే ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు మినీ థియేటర్‌లను నిర్మిస్తున్నాయి. వీటిని కూడా కొంత మంది కబ్జా చేయాలనే ఆలోచనలో వున్నారు అని తెలిపారు.

 

దర్శకుడు డా. వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ దర్శకుడిగా నా తొలి చిత్రం ఎక్కడికికెళ్తుందో మనసు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు. నిర్మాత చిత్రాన్ని సరైన పద్దతిలో ప్రచారం చేయకపోవడం వల్లే ప్రేక్షకులకు చేరువకాలేదు. దాంతో కొంత కాలం దర్శకత్వం వైపు ఆలోచించలేదు. దాదాపు దశాబ్ద కాలం తరువాత నేను దర్శకత్వం వహించిన చిత్రమిది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా నవరసాల్ని మిళితం చేసి ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందించాను. ముగ్గురు యువకులు, ఓ యువతి నేపథ్యంలో సాగే చిత్రమిది.  పడుచుకుర్రాళ్ల ప్రణయగాథగా తెరకెక్కిన ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అన్నారు.

 

నిర్మాత మాట్లాడుతూ వడ్డేపల్లి కృష్ణతో నలభైఏళ్ల అనుబంధం నాది. అనుకున్న బడ్జెట్‌లో అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేశాం. ఈ సినిమా తరువాత మళ్లీ వడ్డేపల్లి కృష్ణతో మరో చిత్రాన్ని ప్రారంభిస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో సాంబ, కిరణ్, పావని, మోగి, వైభవ్, బసిరెడ్డి, భిక్షమయ్య, కాశీవిశ్వనాథ్, హేమ సుందర్ తదితరులు పాల్గొన్నారు.   

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి