
వరుణ్ తేజ్‌ని పెళ్లాడి మెగా కోడలిగా వెళ్లింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. దాదాపు ఐదారేళ్లు సీక్రేట్ గా ప్రేమించుకున్న ఈ జంట పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకొని, పెళ్లి పీటలెక్కారు. రీసెంట్ గానే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు మెగా కపుల్. తమ ఇంట్లో త్వరలో చిన్నారి సందడి చేయబోతున్నట్టు అఫీషయల్ గా అనౌన్స్ చేశారు.
ఇక ఫస్ట్ టైమ్ బేబీ బంప్ తో కనిపించింది లావణ్య త్రిపాఠి. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మాల్దీవులకు వెకేషన్ కోసం వెళ్లారు. అక్కడ ఇద్దరు స్టార్ కపుల్ ఎంజాయ్ చేస్తున్నారు.టూర్ కు వెళ్ళినట్లు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు వరుణ్, లావణ్య. ఈక్రమంలో ఒక పిక్‌ని లావణ్య త్రిపాఠి షేర్ చేసింది.ఇన్‌స్టాలో భర్తతో కలిసి దిగిన పిక్‌ని లావణ్య షేర్ చేయగా, ఇందులో లావణ్య బేబి బంప్‌తో కనిపించింది. ఇది చూసి నెటిజన్స్ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. వెయిటింగ్ అంటూ ఆ పోస్ట్‌కి కామెంట్స్ పెడుతున్నారు.
ఈ జంట, తమ మొదటి సంతానానికి 2025లో వెల్కం చెప్పడానికి రెడీ అవుతున్నారు. మే 6న ఈ గుడ్ న్యూస్ ను మెగా కపుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. చిన్న పిల్లల మిట్టెన్స్‌ను పట్టుకుని ఉన్న ఫోటోను ఈసందర్భంగా పోస్ట్ చేశారు. ఈ అనౌన్స్ మెంట్ టైమ్ లో సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరు ఈజంటకు శుభాకాంక్షలు తెలిపారు.
2023 నవంబర్‌లో ఇటలీలో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ఈ మెగా కపుల్. ఇక పెళ్లి తరువాత లావణ్య త్రిపాఠి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వాలని చూసింది. అయితే, గర్భవతిగా ఉండటంతో ఆ షూటింగ్‌ను కూడా మధ్యలోనే ఆపేసి, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుంది లావణ్య.
అంతే కాదు రీసెంట్ గా తన పెంపుడు కుక్క మృతి చెందడంతో, లావణ్య ఎమోషనల్ అయ్యింది. ఈ విషాద సంఘటనను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుని బాధపడింది. సినిమాలకు దూరం అయినా.. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు ఫ్యాన్స్ కు అందుబాటులోనే ఉంటుంది లావణ్య త్రిపాఠి.