ఇన్సైడ్ టాక్: బన్నీతో సుకుమార్ సినిమా డౌటే..!

By Udaya DFirst Published Apr 11, 2019, 1:18 PM IST
Highlights

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తరువాత అల్లు అర్జున్ నుండి మరో సినిమా రాలేదు. 

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తరువాత అల్లు అర్జున్ నుండి మరో సినిమా రాలేదు. దాదాపు ఏడాది కావొస్తుంది కానీ ఇప్పటివరకు బన్నీ తన తదుపరి సినిమా పట్టాలెక్కించలేదు. త్రివిక్రమ్, సుకుమార్, వేణుశ్రీరాం లతో సినిమాలు ఉంటాయని అనౌన్స్ చేశారు.

దీంతో బన్నీ కెరీర్ లో గ్యాప్ రాదని అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి బన్నీ  అనౌన్స్ చేసిన సినిమాలలో సుకుమార్ సినిమా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెక్క ప్రకారం ముందుగా.. త్రివిక్రమ్ సినిమా మొదలవుతుంది.

అది పూర్తయిన తరువాతే మిగిలిన సినిమాల సంగతి. అయితే సుకుమార్ తో సినిమా చేసే విషయంలో బన్నీ తన నిర్ణయాన్ని మార్చుకునే ఛాన్స్ ఉందని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పటికీ అల్లు కాంపౌండ్ నుండి ఈ సినిమా పట్ల ఆసక్తిగా లేరని ఇన్సైడ్ టాక్.

త్రివిక్రమ్ సినిమా ఆ తరువాత వేణుశ్రీరామ్ లతో చేసిన తరువాతే సుకుమార్ గురించి ఆలోచిస్తారట. దీంతో సుకుమార్ మరోసారి మహేష్ నే నమ్ముకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం, ఆ తరువాత క్యాన్సిల్ చేయడం కామన్ అయిపోయింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి!

click me!