స్కూల్ డ్రెస్ లో చిట్టి రష్మిక.. ఎంత క్యూట్ గా ఉందో!

Published : Apr 11, 2019, 12:27 PM IST
స్కూల్ డ్రెస్ లో చిట్టి రష్మిక.. ఎంత క్యూట్ గా ఉందో!

సారాంశం

'ఛలో' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మికకి తెలుగులో ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది.

'ఛలో' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మికకి తెలుగులో ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. 'గీత గోవిందం' చిత్రంతో భారీ సక్సెస్ అందుకొని టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ లో సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది.

రీసెంట్ గా ఈ బ్యూటీ 23వ పుట్టినరోజు వేడుకులు జరుపుకుంది. ఈ సందర్భంగా తన అభిమానుల నుండి రష్మిక మంచి గిఫ్ట్ అందుకుంది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే.. చిన్నప్పుడు రష్మిక పుట్టినరోజు సందర్భంగా తీసిన మూడు ఫోటోలను సేకరించిన అభిమానులు వాటిని రష్మికకి గిఫ్ట్ గా ఇచ్చారు.

ఆ ఫోటోలు చూసిన రష్మిక ఆనందానికి అవధుల్లేవు. అసలు ఈ ఫోటోలు ఎలా దొరికాయో కానీ ఫోటో షేర్ చేసిన ప్రతి ఒక్కరూ నన్ను నా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లారంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది రష్మిక.

ఈ ఫోటోలు రష్మిక ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన కొద్ది గంటల్లోనే లక్షల్లో లైకులు వస్తున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా