ఆర్ఎక్స్ 100 హీరో తగ్గట్లేదుగా!

By Prashanth MFirst Published Sep 27, 2018, 11:02 AM IST
Highlights

ఏ క్షణాన ఆర్ఎక్స్ 100 సినిమా ఒప్పుకున్నాడో గాని అతనికి ఆ సినిమా ఒక మంచి మార్క్ గా నిలిచింది. బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షాన్ని కురిపించి మరిన్ని అవకాశాలు దక్కేలా చేసింది. ప్రస్తుతం కార్తికేయతో సినిమా చేయాలని కొంత మంది సినీ ప్రముఖులు ప్లాన్ చేస్తున్నారు.

హీరోగా ఎన్ని సినిమాలు చేసినా కొందరికి కెరీర్ లో మరచిపోలేని భారీ విజయం అంత ఈజీగా దక్కదు. అయితే అలాంటి హిట్ ను చాలా తొందరగా అందుకున్నాడు కుర్ర హీరో కార్తికేయ. ఏ క్షణాన ఆర్ఎక్స్ 100 సినిమా ఒప్పుకున్నాడో గాని అతనికి ఆ సినిమా ఒక మంచి మార్క్ గా నిలిచింది. బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షాన్ని కురిపించి మరిన్ని అవకాశాలు దక్కేలా చేసింది. ప్రస్తుతం కార్తికేయతో సినిమా చేయాలని కొంత మంది సినీ ప్రముఖులు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే రెండు ప్రాజెక్ట్ లను కార్తికేయ ఒకే చేశాడని టాక్. అందులో ఒకటి తెలుగు తో పాటు తమిళ్ లో కూడా తెరకెక్కే ద్విభాషా చిత్రం. కబాలి నిర్మాత కలైపులి ఎస్ థను ఆ సినిమాను నిర్మించనున్నారు. ఇకపోతే రీసెంట్ గా ఈ లవర్ బాయ్ మరో తెలుగు ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెంకట్ చంద్ర అనే నూతన్ దర్శకుడు ఆ సినిమాను తెరకెక్కించనున్నాడు. సినిమా రెగ్యులర్ స్టోరీలకు భిన్నంగా ఉండడంతో కార్తికేయ వెంటనే ఒప్పేసుకున్నాడట. 

ఈ కథలో కార్తికేయ ఒక బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా సినిమాను స్టార్ట్ చెయ్యాలని  నిర్మాత ఎమ్ఎస్.రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసి జనవరిలో సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి కార్తికేయ ఆర్ఎక్స్ 100 స్థాయిలో మరోసారి మెప్పిస్తాడో లేదో చూడాలి.

click me!