బయోపిక్ అంటే తెరపై వీలైనంత వరకు నిజాల్ని చూపించాలి. గతాన్ని ఎవరు మళ్ళి చూడలేరు. కానీ అనుభవాలను గుర్తు చేసుకొని ప్రేక్షకుడి ముందే ఆ కథ నడుస్తున్నట్లు చూపించాలి.
బయోపిక్ అంటే తెరపై వీలైనంత వరకు నిజాల్ని చూపించాలి. గతాన్ని ఎవరు మళ్ళి చూడలేరు. కానీ అనుభవాలను గుర్తు చేసుకొని ప్రేక్షకుడి ముందే ఆ కథ నడుస్తున్నట్లు చూపించాలి. ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరక్కిస్తున్న చిత్ర యూనిట్ కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
వారు చూపించేవి ఎంతవరకు నిజాలో తెలియదు గాని రామారావు గారి కెరీర్ మొదట్లో జరిగిన పరిణామాలను కళ్ళకు కట్టినట్లు చూపించేందుకు ట్రై చేస్తున్నారట. రీసెంట్ గా ఎన్టీఆర్ ప్రేమ కథకు సంబందించిన సన్నివేశాలతో పాటు బసవతారకమ్మను ఆయన ప్రేమించి ఎలా పెళ్లి చేసుకున్న విధానం. ఇలా రామారావు జీవితంలో కీలక అంశాలను దర్శకుడు క్రిష్ తనదైన శైలిలో ప్రజెంట్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా వస్తోన్న ఈ సినిమా మొదటి పార్ట్ కి కథానాయకుడు అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా సినిమాను ముగించి బాలకృష్ణ రాజకీయాల్లో బిజీ అవ్వాలని అనుకుంటున్నాడు. వచ్చే సంక్రాంతికి సినిమా విడుదలకానున్న సంగతి తెలిసిందే.