గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

By Prashanth MFirst Published Oct 28, 2018, 3:06 PM IST
Highlights

బడా సినిమాలపై నిత్యం ఎదో ఒక విమర్శ రావడం ఈ రోజుల్లో స్వర్వ సాధారణంగా మారిపోయింది. చిత్ర యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎదో ఒక విషయంలో పెద్ద చిత్రాలకు సంబందించిన గొడవలు చెలరేగుతున్నాయి.

బడా సినిమాలపై నిత్యం ఎదో ఒక విమర్శ రావడం ఈ రోజుల్లో స్వర్వ సాధారణంగా మారిపోయింది. చిత్ర యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎదో ఒక విషయంలో పెద్ద చిత్రాలకు సంబందించిన గొడవలు చెలరేగుతున్నాయి. రీసెంట్ గా మురగదాస్ - విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సర్కార్ సినిమాపై కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. 

కథ తనదే అని దర్శకుడు కాపీ కొట్టినట్లు రచయిత వరుణ్ రాజేంద్రన్ మద్రాస్ కోర్టును ఆశ్రయించాడు. 2007లో వరుణ్ రాసుకున్న కథ సర్కార్ కథ ఒకేలా ఉండటంతో అతన్ని కోర్టుకు వెళ్లకుండా ఆపలేమని రచయితల సంఘం అధ్యక్షుడు భాగ్యరాజ్ కూడా చెప్పారు. అయితే ఈ విషయంపై దర్శకుడు మురగదాస్ స్పందించాడు.

వరుణ్ కథకు నా కథకు ఉన్న పోలిక ఒక్కటే. ఓట్లను ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అనే అంశాన్ని ప్రధానంగా చూపించడం. మిగతా అంశాలు ఏవి కూడా సర్కార్ సినిమాలో లేవు, జయలలితకు స్సంబందించిన విషయాల గురించి కూడా ప్రస్తావించాం. 2007లో జయలలిత మరణం గురించి వరుణ్ ఎలా ప్రస్తావిస్తాడు అని మురగదాస్ ప్రశ్నించారు. అదే విధంగా ఈ విషయం తనను ఎంతో బాధించిందని గుండె పగిలినంత పనైయ్యిందని అన్నారు.

click me!