హరి హర వీరమల్లు లేటెస్ట్ అప్డేట్... పవన్ యాక్షన్ ఇరగదీస్తున్నాడట!

Published : Nov 17, 2022, 02:55 PM IST
హరి హర వీరమల్లు లేటెస్ట్ అప్డేట్... పవన్ యాక్షన్ ఇరగదీస్తున్నాడట!

సారాంశం

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సెట్స్ లో యాక్షన్ ఇరగదీస్తున్నాడంటూ ట్వీట్ చేశారు. హరి హర వీరమల్లుపై ఆయన అప్డేట్ ఇచ్చారు. ఈ క్రమంలో హరీష్ శంకర్ ట్వీట్ వైరల్ అవుతుంది. 

హరి హర వీరమల్లు అనేక కారణాలతో ఆలస్యమైంది. ఇటీవల తిరిగి సెట్స్ పైకి వెళ్ళింది. తాజా షెడ్యూల్ కోసం దర్శకుడు క్రిష్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ నందు పవన్ కళ్యాణ్ పాల్గొనడం జరిగింది. ఇక లేటెస్ట్ షెడ్యూల్ మొదలు కాగా పవన్ పై యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ ట్వీట్ చేశారు. సెట్స్ లో యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ని చూడటం గొప్పగా ఉందని ఆయన ట్వీట్ లో కామెంట్ చేశారు. 

హరి హర వీరమల్లు చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. మొఘలుల కాలం నాటి కథలో పవన్ బందిపోటు పాత్ర చేస్తున్నారు. పవన్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్ ఆతృతగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా   నటిస్తున్నారు. 

కాగా దర్శకుడు హరీష్ శంకర్ తో పవన్ భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేయాల్సి ఉంది. పవన్ పొలిటికల్ అజెండాల కారణంగా ఆలస్యం అవుతుంది. చాలా కాలంగా హరీష్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పట్లో భవదీయుడు మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. దీంతో వేరే హీరోలతో మరో ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan Gift: `ఓజీ` దర్శకుడికి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని గిఫ్ట్.. సుజీత్‌ ఎమోషనల్‌
9 సినిమాలు చేస్తే.. అందులో 8 ఫ్లాప్‌లు.. పాన్ ఇండియా స్టార్‌పైనే ఆశలన్నీ.. ఎవరీ హీరోయిన్.?