ఉదయ్ కిరణ్ గురించి కౌశల్ ఏమన్నాడంటే?

Published : Oct 12, 2018, 03:45 PM ISTUpdated : Oct 12, 2018, 03:46 PM IST
ఉదయ్ కిరణ్ గురించి కౌశల్ ఏమన్నాడంటే?

సారాంశం

టీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కౌశల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ తో తనకున్న స్నేహబంధం గురించి చెప్పాడు. 

బిగ్ బాస్ 2 ముందు కౌశల్ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. అతన్ని దీర్ఘంగా చుస్తే తప్ప సీరియల్ నటుడని చెప్పలేరు. అయితే టాలెంట్ నీరుపించుకుంటేనే ఎక్కడైనా అభిమానులు పుడతారని బిగ్ బాస్ ద్వారా నిరూపించాడు కౌశల్. సీరియల్స్ , సినిమాల్లో నటుడిగా ఎన్నో ఏళ్ళు కొనసాగినప్పటికీ అందుకొని క్రేజ్ ను తన బిహేవియర్ తో బిగ్ బాస్ షో నుంచి పొందాడు. 

అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కౌశల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ తో తనకున్న స్నేహబంధం గురించి చెప్పాడు. "ఉదయ్ కిరణ్ ను మొదటిసారి విశాఖ నగరంలోని బుల్లయ్య కాలేజ్ లో కలిశాను. అతనితో మంచి స్నేహం ఏర్పడింది. మనసంత నువ్వే సినిమాలో కలిసి నటించిన తరువాత లవ్ టుడే సినిమాలో కలిసి నటించాం. 

ఆ తరువాత సుమారు 8 సినిమాల్లో అలా స్నేహంగా నటించాం. అతను చాలా మంచివాడు. గోవా కలిసి వెళ్ళేవాళ్ళం. విశాఖతో పాటు ఇతర పర్యాటక నగరాల్లో కలిసి తిరిగినట్లు చెబుతూ.. అతనితో ఉన్న క్షణాలను మరచిపోలేనని కౌశల్ ఉదయ్ ను గుర్తుచేసుకున్నారు. ఇక బిగ్ బాస్ అనంతరం రెండు సినిమా అవకాశాలు వచ్చాయని మొదట డైరెక్టర్ మారుతీ ఫోన్ చేసినట్లు చెప్పారు. సుకుమార్ కూడా ఫోన్ చేసి తనకు విషెష్ చెప్పినట్లు కౌశల్ తెలిపాడు.  

PREV
click me!

Recommended Stories

చిరంజీవినే ఎదిరించిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ మాటకు నో చెప్పిన దర్శకుడు, కారణం ఏంటి?
Bigg Boss 9 Winner: బిగ్‌ బాస్‌ విన్నర్‌ని కన్ఫమ్‌ చేసిన భరణి, సుమన్‌ శెట్టి.. నాగార్జునకి కొత్త తలనొప్పి