రజనీ లేటెస్ట్ హెల్త్ బులిటెన్..రిపోర్ట్ లు వచ్చాయి

By Surya PrakashFirst Published Dec 27, 2020, 12:35 PM IST
Highlights

 వైద్య పరీక్షల రిపోర్ట్ లు అన్నీ వచ్చాయని.. అంతా సవ్యంగానే ఉన్నట్లు తెలిపారు. రజనీకాంత్‌ డిశ్ఛార్జిపై మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రక్తపోటు హెచ్చుతగ్గులకు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించినట్లు వెల్లడించారు. ఆయనను పరామర్శించేందుకు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న రజనీకాంత్‌ అస్వస్థతకు గురికావడంతో శుక్రవారం జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్స్ విడుదల చేస్తున్నాయి హాస్పటిల్ వర్గాలు. రజనీ ఆరోగ్యం నిన్నటికంటే మరింత మెరుగుపడిందని అపోలో వైద్యులు తెలిపారు. రజనీ ఆరోగ్యంపై ఆపోలో ఆస్పత్రి వైద్యులు ఈ ఉదయం తాజా బులెటిన్‌ విడుదల చేశారు. ఆయనకు ఇవాళ మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు.

 వైద్య పరీక్షల రిపోర్ట్ లు అన్నీ వచ్చాయని.. అంతా సవ్యంగానే ఉన్నట్లు తెలిపారు. రజనీకాంత్‌ డిశ్ఛార్జిపై మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రక్తపోటు హెచ్చుతగ్గులకు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించినట్లు వెల్లడించారు. ఆయనను పరామర్శించేందుకు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.

మరికాసేపట్లో ప్రత్యేక వైద్య బృందం జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రికి చేరుకోనుంది. ర‌జ‌నీకాంత్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని పరీక్షల రిపోర్టులను మరోసారి ప‌రిశీలించి నిర్ణయం తీసుకోనుంది.

డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయన హైదరాబాద్ బేగంపేట నుండి చార్ట‌ర్డ్ ఫ్లైట్‌లో చెన్నైకు వెళ్ల‌నున్న‌ట్టు సమాచారం.  ఈ నెల 31న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న దృష్ట్యా రజనీకాంత్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. పలువురు అభిమానులు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుని త్వరగా కోలుకోవాలంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. 

click me!