సింగరేణి ముద్దు బిడ్డకు ఘన స్వాగతం

Published : Dec 27, 2020, 10:44 AM IST
సింగరేణి ముద్దు బిడ్డకు ఘన స్వాగతం

సారాంశం

హౌస్ నుండి బయటికి వచ్చాక హైదరాబాద్ లోనే ఉన్న సోహెల్, నిన్న రాత్రి కరీంనగర్ చేరుకున్నారు. సోహెల్ రాకను తెలుసుకున్న ఆయన అభిమానులు అక్కడ గుమిగూడడం జరిగింది. కాగా తన మిత్రుడు కోరిక మేరకు సోహెల్ హుస్నాబాద్ మీదుగా కరీంనగర్ చేరుకున్నారట. హుస్నామాబాద్ లో కూడా అనేక మంది అభిమానులు సోహెల్ కి వెల్కమ్ చెప్పారు.   

బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ సోహెల్ కి తన సొంత ఊరు కరీంనగర్ లో ఘనస్వాగతం లభించింది. హౌస్ నుండి బయటికి వచ్చాక హైదరాబాద్ లోనే ఉన్న సోహెల్, నిన్న రాత్రి కరీంనగర్ చేరుకున్నారు. సోహెల్ రాకను తెలుసుకున్న ఆయన అభిమానులు అక్కడ గుమిగూడడం జరిగింది. కాగా తన మిత్రుడు కోరిక మేరకు సోహెల్ హుస్నాబాద్ మీదుగా కరీంనగర్ చేరుకున్నారట. హుస్నామాబాద్ లో కూడా అనేక మంది అభిమానులు సోహెల్ కి వెల్కమ్ చెప్పారు. 

బిగ్ బాస్ సీజన్ 4 లో సోహెల్ మూడవ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. నాగార్జున ఆఫర్ చేసిన రూ. 25లక్షలు తీసుకొని సోహెల్ టైటిల్ రేసు నుండి తప్పుకున్నారు. సోహెల్ కి అదనంగా మరో పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. సోహెల్ నిర్ణయాన్ని హోస్ట్ నాగార్జునతో పాటు, మిగతా ఇంటి సభ్యులు అభినందించారు. 

ఇక హౌస్ నుండి బయటికి వచ్చిన వారంలోపే సోహెల్ కొత్త చిత్ర ప్రకటన చేశారు. జార్జిరెడ్డి ఫేమ్ అప్పిరెడ్డి నిర్మాతగా నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో సోహెల్ హీరోగా ఓ మూవీ తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక బిగ్ బాస్ వేదిక సాక్షిగా తన సినిమాలో నటిస్తాను అని చిరంజీవి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్