'RC15' leak: ట్రాఫిక్ పోలీస్ తో చెడుగుడు ఆడేస్తున్న రాంచరణ్

Published : May 11, 2022, 12:06 PM IST
'RC15' leak: ట్రాఫిక్ పోలీస్ తో చెడుగుడు ఆడేస్తున్న రాంచరణ్

సారాంశం

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో నార్త్ లో క్రేజీ స్టార్ గా మారిపోయాడు. రాంచరణ్ పోషించిన రామరాజు పాత్ర నార్త్ లో బాగా క్లిక్ అయింది. ఆ తర్వాత రాంచరణ్ తన తండ్రి చిత్రం ఆచార్యలో కీలక పాత్రలో నటించాడు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో నార్త్ లో క్రేజీ స్టార్ గా మారిపోయాడు. రాంచరణ్ పోషించిన రామరాజు పాత్ర నార్త్ లో బాగా క్లిక్ అయింది. ఆ తర్వాత రాంచరణ్ తన తండ్రి చిత్రం ఆచార్యలో కీలక పాత్రలో నటించాడు. ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం చెందింది. ఈ షాక్ నుంచి మెగా ఫ్యాన్స్ బయట పడాలంటే మరో సాలిడ్ మూవీ పడాల్సిందే. 

ప్రస్తుతం రాంచరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. సందేశంతో పాటు హై ఓల్టేజ్ యాక్షన్ ఈ చిత్రంలో ఉండబోతోంది. రాంచరణ్ ఈ మూవీలో సివిల్ సర్వీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. విభిన్న గెటప్స్ లో చరణ్ పాత్ర ఉండబోతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

షూటింగ్ ఎక్కువగా రాజమండ్రి, అమృత్ సర్ లాంటి అవుట్ డోర్ లొకేషన్స్ లో చేస్తుండడంతో లీక్ ఫొటోస్, వీడియోస్ ఎక్కువ అవుతున్నాయి. దిల్ రాజు అండ్ టీం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకుల బెడద తప్పడం లేదు. తాజాగా RC 15 నుంచి క్రేజీ వీడియో ఒకటి లీక్ అయింది. 

రాంచరణ్ నడిరోడ్డులో ట్రాఫిక్ పోలీస్ తో గొడవ పడుతూ చిందులేస్తున్న వీడియో లీక్ అయింది. క్రేజీగా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో బ్యాగ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ ఏమేరా జహా సాంగ్ విన్పిస్తుండడం విశేషం. అయితే ఈ సాంగ్ ని అభిమానులు జోడించారమో తెలియాల్సి ఉంది. ఫుటేజ్ మాత్రం RC 15 షూటింగ్ నుంచి లీక్ అయింది. 

రాంచరణ్ కి జోడిగా ఈ చిత్రంలో కియారా అద్వానీ నటిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నారు. శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Brahmamudi Serial Today Episode: బైక్ కోసం తమ్ముడిని ఇరికేంచేసిన రాజు, ఇందును అవమానించిన ఐశ్వర్య
Podarillu Today Episode మార్చి 18: మహాకు షాకిచ్చిన చక్రి, ఇలా అయితే వారికి విడాకులు రావడం కష్టమే