`లాల్‌ సలామ్‌` తెలుగు ట్రైలర్‌.. ముంబయిలో మెయిదీన్‌ భాయ్‌ లెక్క వేరే లెవల్‌..

By Aithagoni Raju  |  First Published Feb 7, 2024, 6:38 PM IST

రజనీకాంత్‌ గెస్ట్ రోల్‌ చేసిన మూవీ `లాల్‌ సలామ్‌`.  ఇందులో మరోసారి తన `బాష` మార్క్ యాక్షన్‌ చూపించబోతున్నారు రజనీ. తాజాగా ట్రైలర్‌లో హింట్‌ ఇచ్చాడు.


రజనీకాంత్ కీలక పాత్ర(ఎక్స్ టెండెడ్‌ కోమియో)లో నటిస్తున్న మూవీ `లాల్‌ సలామ్‌`. ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించిన సినిమా ఇది. విష్ణు విశాల్‌ హీరోగా నటించాడు. విలేజ్‌ క్రికెట్‌ నేపథ్యంలో క్రికెట్‌ వల్ల ఎలాంటి గొడవలు వచ్చాయి? ఆ తర్వాత ఏం జరిగింది. ముంబయిలో పెద్ద డాన్‌ అయిన మోయిదీన్‌ భాయ్‌ ఆ ఊరికి ఎందుకు వచ్చాడనే ఆసక్తికర కథాంశంతో ఈ మూవీ రూపొందుతుంది. 

ఈ మూవీ ఈ నెల 9న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ని విడుదల చేశారు. తమిళంలో ఇప్పటికే విడుదల చేయగా, ఇప్పుడు తెలుగులో రిలీజ్‌ చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌లో.. విలేజ్‌లో పండగ జరుగుతుంది. మరోవైపు హీరో క్రికెట్‌ ఆడుతుంటారు. అందులో గొడవ అవుతుంది. ఆ తర్వాత ఊర్లో మొత్తం అల్లర్లు జరుగుతాయి. ఈ క్రమంలో మెయిదీన్‌ భాయ్‌ ఎంట్రీ ఇస్తాడు. విలన్లని చితకొట్టి ఊరిని సెట్‌ చేస్తాడు. 

Latest Videos

ఇందులో `న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. వ్యవస్థలోని కొన్ని నల్ల గొర్రెలను నేను నమ్మను` అని రజనీకాంత్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ అదిరిపోయింది. ఆ తర్వాత విష్ణు విశాల్‌ ని ఉద్దేశించి చెప్పిన డైలాగు బాగుంది. ఇక చివర్లో రజనీ గురించి ఇచ్చే ఎలివేషన్‌ ఆకట్టుకుంది. సూడ్డానికి తెల్లచొక్క, తెల్ల పాయింట్‌ వేసుకుని, అల్లా ఓ అక్బర్‌ అంటూ రోజుకు ఐదు సార్లు నమాజు చేస్తాడు, న్యాయం, ధర్మం అంటూ సర్దుకుపోయేవాడనుకుంటున్నావా? ముంబయిలో భాయ్‌ బాషా లాంటోడురా` అనే చెప్పే డైలాగ్‌ అదిరిపోయింది. 

ఇక చివర్లో `మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో. మానవత్వాన్ని అందరితో పంచుకో, ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే` అని రజనీ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంది. ఈ క్రమంలో వచ్చే యాక్షన్‌ సీన్లు అదిరిపోయాయి. ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. మంచి కంటెంట్‌తో సినిమా వస్తుందని తెలుస్తుంది. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. క్రికెట్‌, మతం, సామాజిక సమస్యలు, రాజకీయాలు, ఘర్షణలు ఇలా అన్ని ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్‌ నిర్మిస్తున్నారు. తెలుఉగలో శ్రీలక్ష్మి మూవీస్‌ రిలీజ్‌ చేస్తుంది. 

Read more: ఆ పాత్ర చేయాలంటే భయపడుతున్న జూనియర్ ఎన్టీఆర్, తారక్ డ్రీమ్ రోల్ అదేనట.
 

click me!