'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రీమియర్ షో రిపోర్ట్!

Published : Mar 28, 2019, 03:02 PM ISTUpdated : Mar 28, 2019, 03:24 PM IST
'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రీమియర్ షో రిపోర్ట్!

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమ్మర్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సినిమా ఇదే.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమ్మర్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సినిమా ఇదే. ఇప్పటికే సినిమా టికెట్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా.. బుధవారం నాడు చిత్రయూనిట్ కొంతమంది వర్మ సన్నిహితుల కోసం రామానాయుడు స్టూడియోస్ లో ప్రీమియర్ షోని ఏర్పాటు చేశారు. 

ఛార్మి, పూరి జగన్నాథ్ వంటి వారు ఈ సినిమా వీక్షించారు. అలానే కొందరు జర్నలిస్ట్ లు కూడా ఈ సినిమా చూశారు. వారి నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మధ్య కాలంలో వర్మ ఇలాంటి సినిమా తీయలేదని అంటున్నారు. అవుట్ పుట్ బాగానే వచ్చిందని టాక్. సినిమా మొదటి భాగం మొత్తం ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల చుట్టూ తిరుగుతుందట. లక్ష్మీపార్వతికి సంబంధించిన అన్ని విషయాలు సినిమాలో చూపించారట.

ఆమె మొదటి భర్త, సంతానం, ఆమె ఎన్టీఆర్ కి దగ్గర కావడం.. వారి మధ్య ప్రేమ కలగడం ఇలా అన్ని విషయాలను దాచకుండా చూపించారట. సెకండ్ హాఫ్ మొత్తం రాజకీయాల చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. దాపరికాలులేకుండా పరోక్షంగా చెప్పకుండా నేరుగా చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ ని సీఎం స్థానం నుండి దింపడం, ఆయన జబ్బు పడడం, చనిపోవడం వంటి సన్నివేశాలు ఎన్టీఆర్ అభిమానులను కలచివేస్తాయని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయిందని అంటున్నారు. మరి ప్రేక్షకుల వద్ద నుండి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!
 

'లక్ష్మీస్ ఎన్టీఆర్': థియేటర్ ఓనర్లకు బెదిరింపులు!

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు