ఇవాంకా ముందు మంచు లక్ష్మి స్పీచ్

Published : Nov 27, 2017, 07:51 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఇవాంకా ముందు మంచు లక్ష్మి స్పీచ్

సారాంశం

తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మంచు లక్ష్మి గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్స్ సదస్సులో పాల్గొననున్న మంచు లక్ష్మి ఇవాంకా ట్రంప్ ముందు ప్రసంగించే అవకాశం

హైదరాబాద్ లో జరుగుతున్న ద్లోబర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమిట్ లో నటి మంచు లక్ష్మీకి ఓ అరుదైన అవకాశం వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్‌తో కలిసి ఓ సమావేశంలో పాల్గొనే అవకాశం మంచు లక్ష్మీని వరించినట్టు సమాచారం.



హెచ్ఐసీసీలో జరగనున్న ఈ సదస్సులో ఓ ప్యానెల్ మీటింగ్‌కి హాజరయ్యే భారత ప్రతినిధుల బృందంలో మంచు లక్ష్మీ పేరుని కూడా ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సదస్సులో భాగంగా ఇవాంక ట్రంప్ సమక్షంలో.. జరిగే ఓ సమావేశానికి హాజరై సమావేశంలోని ప్రతినిథులను ఉద్దేశించి ప్రసంగించే గొప్ప అవకాశం ఆమె సొంతమైందని తెలుస్తోంది.

 

అయితే లక్ష్మీ మంచు ఈ విషయాన్ని మాత్రం ఎక్కడా షేర్ చేసుకోక పోవడంతో ఇందులో ఎంత నిజం వుందనే అంశంపై స్పష్టత రావాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?