
సినిమా హీరోలకు, హీరోయిన్లకు ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ ఎలా ఉంటారో.. అలానే బయటకు వచ్చి వారి చేతిలో చిక్కినప్పుడు అంతే ఇబ్బంది పెడుతుంటారు. తమ అభిమాన తార.. సడెన్ గా కనిపించేవరకూ తట్టుకోలేక.. సంతోషం పట్టలేక కొంత మంది ప్రేమనంతా ఒకేసారి కుమ్మరిస్తుంటారు. మరికొంత మంది మాత్రం.. తారలు కనిపిస్తే చాలు వారిని టీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో.. ఎక్కడెక్కడో చేయి వేస్తూ.. ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటివారికి మన బాలయ్య కరెక్ట్ అంటూ .. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పబ్లిక్ లో సెలబ్రీటీల ఇబ్బందుల గురించి ఎప్పుడో ఓ ఇంటర్వూలో చెప్పాడు కూడా. ఇక ఆ విషయం పక్కన పెడితే. తమ అభిమాన హీరో కళ్లముందు కనిపిస్తే.. ప్రేమనంతా ఎలా చూపించాలో తెలియక పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు కొందరు అభిమానులు. అలాంటి అభిమాని చేతిలో చిక్కి.. ఇబ్బందులు పడ్డాడు బాలీవుడ్ రొమాంటిక్ హీరో.. యంగ్ స్టార్ ఆదిత్య రాయ్ కపూర్. ఇంతకీ ఆఅభిమాని ఎంత ఇబ్బంది పెట్టిందంటే..?
తాజాగా, ఓ యువతి ప్రముఖ బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ ను కౌగిలించుకుని వదలిపెట్టలేదు. అంతటితో ఆగకుండా.. స్టార్ హీరోను ముద్దు పెట్టుకోవాలని తెగ ట్రై చేసింది. దాంతో ఆ హీరో చాలాసేపు ఒపిగ్గా భరించి.. చివరకు అసహనానికి గురయ్యారు. ఆమెను పక్కకు తోశాడు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. రీసెంట్ గా బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ నటించిన వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్ స్క్రీనింగ్ ముంబైలోని ఓ మల్టీప్లెక్స్‌లో జరిగింది. ఈ స్క్రీనింగ్ కు హాజరయ్యాడు ఆదిత్య. ఆయన అక్కడికి వెళ్లారో లేదో.. కారులోంచి బయటకు దిగిన వెంటనే కొంత మంది లేడీ ఫ్యాన్స్ చూశారు. వెంటనే పరుగు పరుగున ఆయన దగ్గరకు వెళ్లారు.
ఆదియ్యతో సెల్ఫీలు.. ఫొటోలు దిగటానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇక అందులో ఓ లేడీ ఫ్యాన్స్ అయితే ఆదిత్యను బాగా ఇబ్బందిపెట్టింది. ఓ అడుగు ముందుకు వేసి ఆయన్ని కౌగిలించుకుని ఫొటోలు దిగింది. అతక్కడివరకూ బాగానే ఉంది. ఆదిత్య కూడా కాస్త సపోర్ట్ చేసి ఫ్యాన్స్ ను సంతోషపెట్టాడు. ఆ అమ్మాయి అంతటితో ఆగకుండా ఓ ముద్దు కావాలని ఆదత్యను పట్టుకుని దగ్గరకు లాక్కోబోయింది. దాంతో స్టార్ హీరోకు కాస్త చిరాకు వేసింది.వెంటనే .ఆయన సున్నితంగా ఆమెను పక్కకు తోశారు.
ఇక అయినా వినకుండా ఆదిత్య మీదకు రాబోయింది ఆ లేడీ ఫ్యాన్. ఎంత వారిస్తన్న వినకుండా బాలీవుడ్ హీరోను బాగా ఇబ్బందిపెట్టింది యువతి. ఇక ఆదిత్య అంత ఇబ్బందిలోలూ.. కోపం తెప్పిచుకోకుండా.. నవ్వుతూనే ఆమెను పక్కకు పంపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వరుసగా కామెంట్లు కూడా పెడుతున్నారు. ఎక్కువమంది నెటిజన్లు ఆదిత్య రాయ్ కపూర్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అయినంత మాత్రాన ఇలా హీరోను వేధిస్తారా ..? అంటూ సోషల్ మీడియాలో కడిగిపారేస్తున్నారు.