Ennenno Janmala Bandham: విన్నీతో చాలెంజ్ చేసిన యష్.. యష్ కి జాగ్రత్తలు చెప్పిన వేద?

Published : Feb 17, 2023, 12:23 PM IST
Ennenno Janmala Bandham: విన్నీతో చాలెంజ్ చేసిన యష్.. యష్ కి జాగ్రత్తలు చెప్పిన వేద?

సారాంశం

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఫిబ్రవరి 17వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్ లో ఖుషి జంగమ వేషదారణలో వచ్చిన విన్నీ వైపు అలాగే చూస్తూ ఉండగా అప్పుడు ఏంటమ్మా అలాగే చూస్తున్నావు అని వేద  అడగడంతో ఈయనని ఎక్కడో చూసినట్టు గుర్తు ఉంది అని ఉంటుంది ఖుషి. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ లేదు లేదు అనడంతో వెంటనే ఖుషి  తెలిసిపోయింది. అప్పుడు ఏం తెలుసమ్మా అనడంతో విన్నీ ని ఒకసారి కిందకి కూర్చొని చెబుతుంది. అప్పుడు విన్ని తలకు ఉన్న తలపాగా తీసేయడంతో హాయ్ విన్నీ అంకుల్ అనగానే అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు.

అప్పుడు మేము ఎవరు గుర్తుపట్టలేదు నువ్వు ఎలా గుర్తుపట్టావు ఖుషి అని వసంత్ అడుగుతాడు. అది చూసి యష్ కుళ్లుకుంటూ ఉంటాడు. అప్పుడు విన్నీ ఇంత బాగా యాక్ట్ చేసిన నువ్వు ఎలా గుర్తుపట్టావ్ ఖుషి అనీ విన్నీ అడగగా,సింపుల్ అంకుల్ అమ్మని పిలిచిన ప్రతిసారి వేదు అని పిలిచావు వేదు అని నువ్వు ఒక్కడివే మాత్రమే పిలుస్తావు అనడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు విన్నీ వేశం వేసుకుని వచ్చినందుకు ఇంట్లో అందరూ పొగుడుతూ ఉండగా కుళ్ళుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇంట్లో అందరూ విన్నీనీ ఒక జోక్ చెప్పిన నవ్వించమని అడగగా సరే చెప్తాను అని విన్నీ జోక్ చెబుతూ ఉంటాడు.

అప్పుడు ఆ జోక్ విని అందరూ నవ్వుతూ చెప్పట్లు కొడుతూ ఉండగా యష్ మాత్రం కుళ్ళుకుంటూ ఉంటాడు. వీడు వీడి తింగరి జోకులు కూడా నవ్వాలా అనుకుంటూ ఉంటాడు. తర్వాత యష్ కోపంతో వెళ్ళిపోతూ అసలు ఎవడి ఈ విన్నీ ఎక్కడికి వెళ్తే అక్కడ హంగామా ఉంటుంది అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో వేద అక్కడికి వచ్చి ఏంటండీ ఇలా ఒక పక్కకు వచ్చేసారు అనడంతో నాకు ఒంటరిగా ఉండాలి అనిపించింది అందుకే వచ్చేసాను అంటూ తింగరి తింగరిగా వెటకారంగా సమాధానం చెబుతూ ఉంటాడు. అప్పుడు వేద ఏమీ అనకనే వేద మీదకు చిర్రుబుర్రులాడుతూ ఉంటాడు యష్.

అప్పుడు వేద యష్ కి అర్థమయ్యేలా నచ్చ చెబుతూ ఉంటుంది. తర్వాత వేద అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వెంటనే నేను ఎంత కోపంగా ఉన్నా నీ ప్రేమతో ఇట్టే ప్రేమగా మార్చేస్తావు అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు విన్నీ పంచులు వేసి అందరిని సరదాగా నవ్విస్తూ ఉంటాడు. తర్వాత శివరాత్రి స్పెషల్ అని చిత్ర పానకం తీసుకొని రావడంతో ఎవరైతే ఎక్కువ పానకం తాగుతారో వాళ్లే విన్నర్ అని పోటీని పెడతాడు. అప్పుడు అందరూ పోటీకి రెడీ అనగా ఇంతలోనే అక్కడికి వేద వచ్చి ఈ పోటీలో ఎవరు పాల్గొనవద్దు ఎందుకంటే తప్పకుండా ఆ పోటీలో విన్నీనే గెలుస్తాడు అంటూ కాలేజ్ డేస్ లో జరిగిన విషయాలు పంచుకుంటూ ఉంటుంది వేద.

అప్పుడు ఖుషి ఎవరు పాటిస్పేట్ చేయకపోయినా మా డాడీ పాటిస్పేట్ చేస్తాడు అని అంటుంది. అవును ఖుషి చెప్పినట్టు నేను ఈ పోటీలో పాల్గొంటాను అనడంతో అప్పుడు వేద వద్దండి అనగా ఏమి మీ ఫ్రెండ్ ఓడిపోతాడని భయపడుతున్నావా అనగా లేదు మీరే ఓడిపోతున్నారు అని హింటిస్తున్నాను అంటుంది వేద. తర్వాత పోటీ మొదలవుతుంది. ఇప్పుడు వేద విన్నీకి యష్ కి ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుందీ. అప్పుడు ఇద్దరు పోటీపడి మరి పామకం తాగుతూ ఉంటారు. అప్పుడు యష్ పోటీలో గెలుస్తాడు.

 ఆ తర్వాత ఆ వేద వినికి స్వారీ చెప్పగా నాకు కంగ్రాట్స్ చెప్పవా అని యష్ అనడంతో చెప్తాను కానీ నాకు ఒక మాట ఇవ్వాలి ఇంకొకసారి ఇలాంటి పోటీలలో పాటిస్పేట్ చేయకూడదు అని అంటుంది. ఆ తరువాత యష్ కి మోషన్స్ పెట్టుకోవడంతో యష్ బాత్రూంలోకి లోపలికి తిరుగుతూ ఉంటాడు. అప్పుడు యష్ పని చేసుకుంటూ ఉండగా అప్పుడు కడుపులో గుడగుడ అనడంతో వేద చూస్తుందేమో అని కవర్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు వేద ముందు ఏమి జరిగినట్టుగా నాటకాలు ఆడుతూ ఉంటాడు. నేను ముందే చెప్పాను కదా పోటీ పడొద్దు అంటే పడ్డారు ఇప్పుడు చూసారా ఏమయిందో అని అంటుంది వేద. ఇప్పుడు మళ్లీ యష్ బాత్రూం లోకి పరుగులు తీయడంతో అది చూసి వేద నవ్వుకుంటూ ఉంటుంది. మరోవైపు విన్నీ కూడా మోషన్స్ పెట్టుకోవడంతో ఇబ్బంది పడుతూ ఉండగా ఇంతలోనే వేద అక్కడికి వస్తుంది.

PREV
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో