
విద్యుల్లేఖ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. గతంలో విద్యుల్లేఖ బొద్దుగా కనిపించేది. ప్రస్తుతం విద్యుల్లేఖ తన ఫిజిక్ పై దృష్టిపెట్టినట్లుంది. ఇటీవల విద్యుల్లేఖ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు అందరికి షాకిచ్చేలా ఉన్నాయి. నటనతో పాటు ఆమె బొద్దుగా ఉండడం కూడా కమెడియన్ గా అవకాశాలు వచ్చేలా చేసింది.
కానీ విద్యుల్లేఖ అలా పాపులర్ కావడానికి ఇష్టపడడం లేదు. కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాలని భావిస్తోంది. తన లుక్ పై దృష్టి పెట్టి జిమ్ లో కష్టపడింది. ఆశ్చర్యకరంగా బరువు తగ్గి నాజూకైన లుక్ మారిపోయింది.
గతంలో విద్యుల్లేఖపై అనేక విమర్శలు వినిపించాయి. కేవలం తెలుగు చిత్రాలకే ఆమె ప్రాధాన్యత ఇస్తోందని తమిళ చిత్రపరిశ్రమలో కొందరు విద్యుల్లేఖని విమర్శించారు. తనకు తమిళం కంటే తెలుగులోనే మంచి అవకాశాలు వస్తున్నాయని విద్యుల్లేఖ ఆ తర్వాత క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం విద్యుల్లేఖ వెంకిమామ చిత్రంలో నటిస్తోంది.