మెగా హీరోతో రొమాన్స్.. ఇస్మార్ట్ పిల్లకు క్రేజీ ఆఫర్!

Published : Sep 12, 2019, 03:06 PM ISTUpdated : Sep 12, 2019, 03:09 PM IST
మెగా హీరోతో రొమాన్స్.. ఇస్మార్ట్ పిల్లకు క్రేజీ ఆఫర్!

సారాంశం

ఇస్మార్ట్ శంకర్ చిత్రం దర్శకుడు పూరి జగన్నాధ్ తో పాటు నటీనటులకు కూడా చాలా బాగా ఉపయోగపడింది. పూరి వరుస పరాజయాలకు బ్రేక్ వేసిన చిత్రం ఇది. ఇక హీరో రామ్ కి కూడా ఈ చిత్రం మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన నిధి అగర్వాల్, నభా నటేష్ టాలీవుడ్ లో క్రేజీ భామలుగా మారిపోయారు. 

యుంగ్ బ్యూటీ నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో కుర్రకారు హృదయాలు కొల్లగొట్టింది. గ్లామర్ షోతో పాటు, పెర్ఫామెన్స్ కూడా అదరగొట్టేసింది. ప్రస్తుతం నభా నటేష్ రవితేజ సరసన డిస్కో రాజా చిత్రంలో నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ సక్సెస్ తో నభాకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. 

తాజాగా నభా నటేష్ ఓ క్రేజీ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత తేజు ఓ డెబ్యూ దర్శకుడికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 

అత్తారింటికి దారేది ఫేమ్ బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ నభా నటేష్ కు దక్కినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించనున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. 

 

PREV
click me!

Recommended Stories

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్