బాలయ్య మనసు బంగారం అంటున్న కైరాదత్.. డేట్ అదిరింది

Published : Jul 31, 2017, 03:41 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
బాలయ్య మనసు బంగారం అంటున్న కైరాదత్.. డేట్ అదిరింది

సారాంశం

బాలయ్యతో డిన్నర్ డేట్ కు వెళ్లిన కైరా దత్ ఫోటో వైరల్ కైరా తో ఏకాంతంగా బాలయ్య డిన్నర్ ఇద్దరూ కలిసి రెస్టారెంట్ లో తీయించిన ఫోటో ట్వీట్ చేసిన కైరా

నటసింహం నందమూరి బాలకృష్ణ పార్టీలంటే పెద్దగా ఇష్ట పడరు. షూటింగ్‌ పని లేకుంటే.. అటు రాజకీయాల్లోనో.. లేక కుటుంబ సభ్యులతోనో బిజీగా గడుపుతారు. తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని.. పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి బాలకృష్ణ తెలుగు తెరకు సరికొత్త హీరోయిన్‌తో డిన్నర్ డేట్‌కు వెళ్లడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆ యువనటితో కలిసి డిన్నర్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నాలుగు రోజులుగా తెగ సందడి చేస్తున్న ఆ డేట్ సంగతేంటో చూద్దాం.

 

ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న పైసా వసూల్ చిత్రంలో ముగ్గురు కథనాయికలు. అందులో ఒకరు కైరాదత్. పైసా వసూల్ విడుదలకు ముందే కైరా దత్ గురించి బాగానే చర్చించుకొంటున్నారు నెటిజన్లు. ట్విటర్‌లో బాలయ్య డిన్నర్ డేట్ ఫొటోతో తాజాగా మరోసారి కైరాదత్ వార్తలో నిలిచింది. బాలకృష్ణతో కలిసి కైరా ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్లడం విశేషంగా మారింది. ఆ డిన్నర్‌కు సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది కైరా. ఆ ఫొటోకు పిచ్చ  రెస్పాన్స్ వస్తోంది. లైకులు, రీట్వీట్లతో మారుమోగుతోంది.

 

“బాలకృష్ణ గారితో డిన్నర్ డేట్ నైట్. బాలయ్య పక్కా జెంటిల్మన్. ఆయన మనసు బంగారం. ఆయన అంటే నాకు బాగా ఇష్టం. అంతులేని గౌరవం, ప్రేమాభిమానాలు కురిపించారు” అని ఫొటోతో సహా తన మనసులో మాటలు ట్వీట్ చేసింది కైరాదత్. బాలయ్య షూటింగ్ సందర్భంగా తనకు బాగా సహకరించారని, డైలాగ్ డెలివరీ గురించి కూడా వివరించారని.. కీలక సన్నివేశాల్లో తన సహకారం మరువలేనిదని” కైరా కమెంట్ చేస్తూ డిన్నర్ డేట్ ఫోటో పెట్టింది.

సో బాలయ్యతో డిన్నర్ డేట్ చాలా ఎంజాయ్ చేసిందన్న మాట.

 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?