
విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం `ఖుషి`. పాటలతోనే మంచి బజ్ ఏర్పర్చుకున్న చిత్రమిది. విడుదలైన పాటలన్నీ విశేష ఆదరణ పొందాయి. టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక ఈ సినిమా నుంచి ఐదో పాటని విడుదల చేశారు. `ఓసి పెళ్లామా` అంటూ సాగే పాటని శనివారం విడుదల చేశారు. ఇందులో భార్యల టార్చర్ ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం చేశారు. భార్యలు భర్తలతో ఎలా ప్రవర్తిస్తారు, ఎలా కోప్పడతారు, ఎలా విసిగిస్తారు? అనేది లిరికల్ ద్వారా చెప్పారు.
సినిమాలో సమంత తనని ఎంతగా ఇబ్బంది పెడుతుందో విజయ్ ఈ పాట రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. పబ్‌లో ఈ పాట రావడం విశేషం. దీంతో పాటపై ఆసక్తి ఏర్పడింది. అందరికి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు. ఐదు భాషల్లో ఈ పాటని విడుదల చేశారు. పబ్ లో పార్టీ సాంగ్ గా ఈ పాటను చిత్రీకరించారు. 'ఓసి పెళ్లామా..' పాటకు డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ రాయగా హేషమ్ అబ్దుల్ వాహాబ్ మరోసారి క్యాచీ ట్యూన్ అందించారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, సాకేత్ పాడారు.
లవ్, ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ చిత్రాలను తెరకెక్కించడంలో మంచి పేరుతెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం విశేషం. అదే సమయంలో `మహానటి` లో విజయ్, సమంత కాసేపు అలరించింది. ఇప్పుడు ఈ చిత్రంతో పూర్తి స్థాయిలో కలిసి నటించారు. దీంతో ఈ ఇద్దరు మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే ఆసక్తి ఏర్పడింది. సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ‘ఖుషి’ ఇంకో 6 రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విప్లవ్, ఆరాధ్య ప్రేమకథను అందంగా తెరపై చూపించబోతోందీ సినిమా.
https://telugu.asianetnews.com/entertainment/kushi-movie-fifth-song-raleased-how-samanth-torture-to-vijay-deverakonda-arj-s003dc
సెప్టెంబర్ 1న `ఖుషి` చిత్రం విడుదల కాబోతుంది. దీనిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాలని విజయ్ బలంగా నమ్ముతున్నారు. శివ నిర్వాణ కూడా హిట్ కొట్టి తన సత్తాని చాటాలనుకుంటున్నారు. సమంతకి సైతం ఓ హిట్ కావాలి. ఆమె కూడా `ఖుషి`పై చాలా నమ్మకంతో ఉంది. మరి ఈచిత్ర రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.
టెక్నికల్ టీమ్:
మేకప్ : బాషా
కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
ఆర్ట్ : ఉత్తర కుమార్, చంద్రిక
ఫైట్స్ : పీటర్ హెయిన్
రచనా సహకారం : నరేష్ బాబు.పి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ : బాబ సాయి
మార్కెటింగ్ : ఫస్ట్ షో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
డి.ఐ, సౌండ్ మిక్స్ ః అన్నపూర్ణ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ మాట్రిక్స్
సి.ఇ.ఓ : చెర్రీ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి
నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
కొరియోగ్రఫీ : శివ నిర్వాణ
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ.