
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ `ఖుషీ`. సమంత కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. శివ నిర్వాణ దర్శత్వం వహించిన ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే మంచి టాక్ తెచ్చకుంది. దాంతో ఈ వీకెండ్ భాక్సాఫీస్ దగ్గర బాగా వర్కవుట్ అయ్యింది.
మొదటి రోజు వైరల్డ్ వైడ్‌గా రూ.30.1 కోట్లు వసూలు చేసింది. రెండవ రోజు కూడా అదే జోరుని కొనసాగిస్తూ విజయ్ సినిమాల్లో రికార్డు స్థాయి వసూళ్ల దిశగా పయనిస్తోంది. రెండు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.51 కోట్లు గ్రాస్ రాబట్టిందని మేకర్స్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. మూడో రోజున కూడా కుమ్మిపారేసింది. మూడో రోజు కూడా సుమారు 19కోట్లు రాబట్టింది. అయితే మల్టిఫ్లెక్స్ లు, ఓవర్ సీస్ లలో వర్కవుట్ అయ్యినట్లుగా బి,సి సెంటర్లలో ఆ స్పీడు లేదు. ఓవర్సీస్‌లో వన్ మిలియన్ మార్కుని దాటేసిందని, త్వరలోనే రెండు మిలియన్‌ల క్లబ్‌లో చేరనుందని వార్తలు వినిపిస్తున్నాయి. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ.70కోట్లు మూడు రోజుల్లో రాబట్టడం విశేషం. త్వరలోనే ఇది వంద కోట్ల క్లబ్‌లో చేరబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అలాగే నైజాం(తెలంగాణ), అమెరికాలో ఉన్నట్లుగా కలెక్షన్స్ ఆంధ్రా, రాయలసీమలో లేదు అని మొదట అనుకున్నా ఆదివారం అన్నిచోట్లా ఒకటే రెస్పాన్స్ వచ్చింది… హౌస్ ఫుల్ బోర్డ్స్ కనపడ్డాయి. చెన్నైలో కూడా ఆదివారం షోలు ఫుల్ అయ్యాయి. మొత్తంగా ఫస్ట్ వీకెండ్ మంచి వసూళ్లని అందుకొంది. విజయ్ దేవరకొండ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ రోజు సోమవారం “ఖుషి” సక్సెస్ ఈవెంట్ వైజాగ్ లో జరగనుంది.