రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’.. ఈనెలలోనే విడుదల.. ఎప్పుడంటే?

By Asianet News  |  First Published Sep 4, 2023, 2:11 PM IST

కిరణ్ అబ్బవరం నెక్ట్స్ ‘రూల్స్ రంజన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా మేకర్స్ చిత్ర విడుదల తేదీని అనౌన్స్ చేశారు. 
 


టాలీవుడ్ యంగ్ సెన్సేషన్,  హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)  తాజాగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న కిరణ్ తన నెక్ట్స్ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ ఏడాదిలోనే రెండు సినిమాలు ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘మీటర్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నెక్ట్స్ Rules Ranjan తో అలరించేందుకు సిద్దమవుతున్నారు.

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి (Neha  Shetty) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. 

Latest Videos

undefined

ఈ క్రమంలో మేకర్స్ ‘రూల్స్ రంజన్’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. చిత్రాన్ని ఇదే నెలలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్ 28న చిత్ర విడుదల తేదీగా అనౌన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా వదిలిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. క్లాస్ లుక్ లో నేహా, కిరణ్ ఆకట్టుకున్నారు. 

ఇక 'రూల్స్ రంజన్'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి, 'నాలో నేనే లేను', 'సమ్మోహనుడా' పాటలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. Sammohanuda సాంగ్ సోషల్ మీడియాలో ఎంతలా ట్రెండ్ అవుతుందో తెలిసిందే. 20 మిలియన్ల వ్యూస్ అందుకుంది. వినోదమే ప్రధానంగా ఈ చిత్రం రూపొందుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Releasing on Sep 28th pic.twitter.com/JCyh77bj5h

— YJR (@yjrambabu)
click me!