మెగాస్టార్ తో రొమాన్స్ చేయాలని ఉంది..ఖుష్బు బోల్డ్ కామెంట్స్ వైరల్..

Published : May 03, 2023, 05:45 PM IST
మెగాస్టార్ తో  రొమాన్స్ చేయాలని ఉంది..ఖుష్బు బోల్డ్ కామెంట్స్ వైరల్..

సారాంశం

మెగాస్టార్ తో మళ్ళీ రొమాన్స్ చేస్తానంటోంది సీనియర్ హీరోయిన్.. తమిళ నటి ఖుష్బు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ఇండ్రెస్టింగ్ విషయాలు శేర్ చేసుకుంది. 

తమిళ,తెలుగు  ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన హీరోయిన్ కుష్భూ సుందర్‌. తెలుగు సినిమాతోనే తన సినిమా  కెరీర్‌ను స్టార్‌ చేసిన ఖుష్బు... ఆతరువాత  తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా.. వెలుగు వెలిగింది. ఎన్నో  బ్లాక్‌ బాస్టర్‌ హిట్ సినిమాలు చేసిన ఖుష్బు.. కు డైహాట్ ఫ్యాన్స్ ఎక్కువ. ముఖ్యంగా తమిళంలో ఒక దశలో ఆమెను మించిన హీరోయిన్ లేదు అంటే అతిశోయోక్తి కాదు. దాదాపు దశాబ్దం పాటు కోలీవుడ్ లోనెంబర్ వన్ హీరోయిన్ గా.. ఊపు ఊపిన ఈ సీనియర్ బ్యూటీకి అభిమానులు ఏకంగా  గుడి కట్టించారు. కుష్బూ ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం రామబాణం రిలీజ్ కు రెడీగా ఉంది. 

రామబాణం సినిమా గోపీంచంద్ హీరోగా.. శ్రీవాసు దర్శకత్వం వహించారు. ఈమూవీ మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా టీం ప్రమోషన్లలో బిజీ అయిపోయింది. ఈ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది ఖుష్బు. ఈసందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.  ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్  చేసింది ఖుష్బు. మెగాస్టార్‌ చిరంజీవితో మళ్ళీ..  రొమాన్స్‌ చేయాలన్న తన కోర్కెను బయటపెట్టారు ఖుష్బు. 

ఇక  మెగాస్టార్‌ చిరంజీవి గురించి కుష్బూ మాట్లాడుతూ..  చిరు నుంచి నేర్చుకోవల్సింది చాలా ఉంది అన్నారు. ఆయన ఓ లెజెండ్‌. మానవత్వం కలిగిన వ్యాక్తి.  ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం చిరంజీవిది అన్నారు. అంతే కాదు  చేసే పని మీద ప్యాషన్‌  కూడా ఆయనకు ఎక్కువగా ఉంటుంది అన్నారు. అంతే కాదు ఆయన ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. కొత్తది చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పారు ఖుష్బు. అంతే కాదు నేను మెగాస్టార్ ను కదా.. ఏం చేసినా.. జనాలు చూస్తారు లే అని ఆయన అనుకోరు.. కొత్తగా చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు అన్నారు ఖుష్బు. 

ఇప్పటివరకు పూర్తికాని, నా కల ఏదైనా ఉంది అంటే.. అది చిరంజీవి గారితో రొమాన్స్‌ చేయలేకపోవటమే.. స్టాలిన్‌లో ఆయనతో కలిసి నటించాను.  కాని ఆ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి  రీసెంట్ గా ఓ కమర్షియల్‌ యాడ్‌ చేశాము. దానికి మంచి స్పందన వచ్చింది. ఆయనతో కలిసి పని చేయటానికి ఓ మంచి స్క్రిప్టు కోసం చూస్తున్నా.. మెచ్యూర్‌ లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామాలాంటివి చిరంజీవి గారితో చేయాలని ఉంది. అదే నా కల అని అన్నారు. మరి ఇది సాధ్య అయ్యే పనేనా అనేది చూడాలి. మెగాస్టార్ ఖుష్బుకు ఛాన్స్ ఇస్తారా..? అనేది తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

SreeLeela remuneration: శ్రీలీల ఆ సినిమాకి మరీ అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకుందా?
Gunde Ninda Gudi Gantalu: అత్త ప్రభావతి చేసిన కుట్రతో బాలు వద్ద అడ్డంగా దొరికిపోయినా మీనా