నాగచైతన్య నెక్ట్స్ మూవీ ఫైనల్.. డైరెక్టర్‌ ఎవరంటే ?

Published : May 03, 2023, 05:41 PM IST
నాగచైతన్య నెక్ట్స్ మూవీ ఫైనల్.. డైరెక్టర్‌ ఎవరంటే ?

సారాంశం

అక్కినేని హీరో నాగచైతన్య ఇప్పుడు `కస్టడీ` సినిమాతో రాబోతున్నారు. ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తున్నారనేది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ని ఫిక్స్ చేసుకున్నాడట చైతూ. 

నాగచైతన్య.. ప్రస్తుతం `కస్టడీ` చిత్రంలో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. చైతూ పోలీస్‌గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 12న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్స్ లో చైతూ బిజీగా ఉన్నారు. డిఫరెంట్‌ ప్రమోషన్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఇప్పుడు తన తదుపరి సినిమా ఫైనల్‌ అయ్యిందట. ఆయన తనకు `మజిలి` లాంటి హిట్‌ సినిమాని అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారట. ఆల్మోస్ట్ ఈ స్టోరీకి చైతూ కనెక్ట్ అయ్యారని, త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా చేయడంలో శివ దిట్ట. `మజిలి`తో అనే నిరూపించారు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ, సమంతలతో `ఖుషి` సినిమా చేస్తున్నారు. ఇది రొమాంటిక్‌ డ్రామాగా రూపొందుతుంది. ఇది సెప్టెంబర్‌ 1న విడుదల కానుంది. 

ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన అనంతరం చైతూ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందట. ఇదిలా ఉంటే చైతూ మరో సినిమాకి కమిట్‌ అయ్యారట. గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే దీనికి దర్శకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. చందుమొండేటి పేరు వినిపిస్తుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాలి. 

నాగచైతన్యకి `మజిలి` తర్వాత సరైన హిట్‌ పడలేదు. `బంగార్రాజు` యావరేజ్‌గా ఆడింది. ఆ తర్వాత చేసిన `థ్యాంక్యూ` మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో సరైన బ్రేక్‌ లాంటి సినిమా కోసం వేయిట్‌ చేస్తున్నారు. మరి ఇప్పుడు వెంకట్‌ ప్రభుతో చేస్తున్న సినిమాతో సత్తా చాటుతాడా? అనేది చూడాలి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?