'మహానటి'పై కెటీఆర్ కామెంట్!

First Published May 10, 2018, 11:50 AM IST
Highlights

'మహానటి' చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా చక్కటి 

'మహానటి' చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా చక్కటి అనుభూతిని కలిగిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమెరికాలో ప్రివ్యూల ద్వారా ఈ సినిమా రూ.1.54 కోట్లను రాబట్టింది. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణా మినిస్టర్ కెటీఆర్ కూడా ఈ సినిమాపై కామెంట్ చేశారు. పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఏది విడుదలైనా మొదటిరోజే చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటారు కెటీఆర్. 

'మహానటి' సినిమాను చూసిన ఆయన ఈ సినిమా ఒక అద్భుతమని అన్నారు. మహానటి ఓ మంచి అనుభవాన్ని మిగిల్చిందని, కీర్తి సురేష్ హన పాత్రలో స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ కనబరిచిందని అన్నారు. నాగ్ అశ్విన్ అద్భుత దర్శకత్వ ప్రతిభకు నా అభినందనలు.. సమంత, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, స్వప్నా దత్ లకు నా శుభాకాంక్షలు అని వెల్లడించారు. 

click me!