'క్షణం' దర్శకుడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే..!

Published : Aug 23, 2019, 11:48 AM IST
'క్షణం' దర్శకుడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే..!

సారాంశం

నిజానికి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రానా దగ్గుబాటితో దర్శకుడు రవికాంత్ పేరేపు ఓ సినిమా చేయాల్సివుంది కానీ వర్కవుట్ అవ్వలేదు. దీంతో సైలెంట్ గా మరో సినిమా మొదలుపెట్టేశాడు. ఈ సినిమాకి 'కృష్ణ అండ్ హిస్ లీలా' అనే టైటిల్ కన్ఫర్ చేశారు. ఈ సినిమాలో 'కల్కి' ఫేం నటుడు సిద్ధూ హీరోగా నటిస్తున్నారు. 

అడివి శేష్ హీరోగా 'క్షణం' సినిమాను డైరెక్ట్ చేసిన రవికాంత్ పేరేపు మంచి హిట్ అందుకున్నాడు. అయితే ఆ తరువాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు. దాదాపు మూడేళ్ల సమయం తీసుకున్న అతడు ఎట్టకేలకు తన సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు.

నిజానికి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రానా దగ్గుబాటితో ఓ సినిమా చేయాల్సివుంది కానీ వర్కవుట్ అవ్వలేదు. దీంతో సైలెంట్ గా మరో సినిమా మొదలుపెట్టేశాడు. ఈ సినిమాకి 'కృష్ణ అండ్ హిస్ లీలా' అనే టైటిల్ కన్ఫర్ చేశారు. ఈ సినిమాలో 'కల్కి' ఫేం నటుడు సిద్ధూ హీరోగా నటిస్తున్నారు. సీరత్ కపూర్ అతడి సరసన హీరోయిన్ గా కనిపించనుంది.

ఆర్టికల్ 370 రద్దు తరువాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న లధాఖ్ లో సినిమా షూటింగ్ పూర్తి చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసిన దర్శకుడు రవికాంత్ సముద్రపు స్థాయికి 17వేల అడుగులకు పైనున్న ఎత్తులో షూటింగ్ చేయడం ఓ గొప్ప అనుభూతిని కలిగించిందని చెప్పాడు.

అక్కడున్న స్థానికులు, ప్రభుత్వ అధికారులు సహకరించడం వలనే షూటింగ్ పూర్తి చేయగలిగామని చెప్పారు. అయితే ఈ సినిమా ఏ జోనర్ కి సంబంధించిందనే విషయాలను మాత్రం బయటపెట్టలేదు. 'క్షణం' సినిమాకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్