కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా'.. ఇంట్రెస్టింగ్ అప్డేట్

Published : Aug 23, 2019, 11:17 AM IST
కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా'.. ఇంట్రెస్టింగ్ అప్డేట్

సారాంశం

  కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచి వాడవురా సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అధికారికంగా వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. 

కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచి వాడవురా సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అధికారికంగా వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా గుజరాతి ఆక్సిజన్ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ అని తెలుస్తోంది. 

దర్శకుడు సతీష్ వేగేశ్న ఒరిజినల్ కథను ఆధారంగా చేసుకొని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ పాత్రలో కూడా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఒరిజినల్ కథలా కాకుండా డిఫరెంట్ టేకింగ్ తో దర్శకుడు రూపొందిస్తున్నట్లు సమాచారం. సతి వేగేశ్న 2017సంక్రాంతికి శతమానం భవతి సినిమాతో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే, 

అయితే గత ఏడాది ఈ దర్శకుడు తీసిన శ్రీనివాస కళ్యాణం మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవ్వలేకపోయింది. ఇక ఇప్పుడు సంక్రాంతి సెంటిమెంట్ ఎంత మంచివాడవురా సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే