ప్రభాస్‌తో పెళ్లి.. ఆ హీరో చేసిన పెంటే.. డార్లింగ్‌తో ప్రేమ వ్యవహారంపై కృతిసనన్‌ క్లారిటీ

Published : Mar 08, 2023, 06:00 PM IST
ప్రభాస్‌తో పెళ్లి.. ఆ హీరో చేసిన పెంటే.. డార్లింగ్‌తో ప్రేమ వ్యవహారంపై కృతిసనన్‌ క్లారిటీ

సారాంశం

`ఆదిపురుష్‌` జంట ప్రభాస్‌, కృతి సనన్‌ ప్రేమలో ఉన్నారనే వార్తలు తరచూ చక్కర్లు కొడుతున్నారు. అంతేకాదు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటున్నారు. తాజాగా దీనిపై కృతి సనన్‌ మరోసారి స్పందించింది. 

ప్రభాస్‌పై డేటింగ్‌ రూమర్లు తరచూ హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. గతంలో `బాహుబలి` టైమ్‌లో అనుష్కతో ఎఫైర్ ఉందని, ఇద్దరు పెళ్లి చేసుకోబోతుందన్నారు. చాలా కాలం వరకు ఈ వార్తలు చక్కర్లుకొట్టాయి. ఇప్పుడు `ఆదిపురుష్‌` హీరోయిన్‌ కృతి సనన్‌తో ఎఫైర్‌ వార్తలు తరచూ హాట్‌ టాపిక్‌అవుతున్నాయి. ఇప్పటికే ఈ వార్తలపై కృతి సనన్‌ స్పందించింది. తమ మధ్య అలాంటిదేం లేదని చెప్పింది. కానీ ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు, పెళ్లికి సిద్ధమయ్యరనే పుకార్లు వినిపించాయి. ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ కూడా ఫిక్స్ అయ్యిందంటూ బాలీవుడ్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. 

అయితే తాజాగా ఇప్పుడు కృతి సనన్‌ దీనిపై మరోసారి స్పందించి క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ పుకార్లకి కారణం ఏంటో కూడా ఆమె వివరించింది. అందుకు ఓ స్టార్‌ హీరోనే కారణమని చెప్పడం గమనార్హం. ఆ వివరాలను వెల్లడించింది కృతి. దీనికి కారణం బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ అని చెప్పింది. ఆయనే ఈ పుకార్లు సృష్టించారని, ఆయన క్రేజీ కోసం మమ్మల్ని ఇరికించారని చెప్పింది. ఆయనకు వరుసగా ఇంటర్వ్యూలిచ్చి బోర్‌ కొడుతుంది, ఏదైనా సమ్‌ థింగ్‌ చేయాలనుకున్నారు, ఏదైనా పుకార్‌ సృష్టిద్దామన్నాడు, నా జీవితంలో ఓ స్పెషల్‌ పర్సన్‌ ఉన్నాడని చెప్తానన్నాడు, సరే అన్నాను, అలా ఓ ఇంటర్వ్యూలో నా మనసులో ఒకరున్నారని చెప్పాడు. అక్కడి వరకు ఓకే కానీ, అందులోకి ప్రభాస్‌ని లాగుతాడని అనుకోలేద`ని చెప్పింది కృతి. 

ఇది ఆయన చేసిన పెంటే అని చెప్పింది. అయితే ఈ పెంట గురించి ప్రభాస్‌కి చెప్పేందుకు ఫోన్‌చేశానని, ఆయనేమో వరుణ్‌ ఎందుకలా చెప్పాడని తననే రివర్స్ ప్రశ్నించాడట. నాకు కూడా తెలియదని చెప్పా, అతను నా ఫ్రెండే కానీ పిచ్చోడు, ఏదేదదో మాట్లాడాడని చెప్పాను, వరుణ్‌ చేసిన పని వల్ల నాకు అందరు శుభాకాంక్షలు చెబుతూ సందేశాలు పంపిస్తున్నారు. అందుకే నేనే స్పందించక తప్పలేదని పేర్కొంది కృతి సనన్‌. మొత్తానికి ఈ పెంటకి కారణం వరుణ్‌ ధావన్‌ అని చెప్పింది. మరి ఇప్పటికైనాఈ రూమర్స్ కి బ్రేక్‌ పడుతుందా;? మళ్లీ ఊపందుకుంటాయా? అనేది చూడాలి. 

ప్రభాస్‌ ప్రస్తుతం `ఆదిపురుష్‌`తోపాటు `సలార్‌`, `ప్రాజెక్ట్ కే`, `రాజా డీలక్స్` చిత్రాలు చేస్తున్నాడు. `ఆదిపురుష్‌` జూన్‌ 16న విడుదల కాబోతుంది. రామాయణం ఆధారంగా ఓం రౌత్‌ రూపొందించిన చిత్రమిది. సైఫ్‌ అలీ ఖాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతి సనన్‌ నటిస్తున్నారు. పాన్‌ ఇండియా లెవల్‌లో భారీగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Harikrishna: ఆ శక్తి ఉంటే తప్పకుండా నందమూరి హరికృష్ణని బతికిస్తా.. ఎలాగో చెబుతూ కీరవాణి ఎమోషనల్ కామెంట్స్
Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌