నా జీవితంపై ఎంతో ప్రభావం చూపిన మహిళలు వీరే.. చిరంజీవి ఉమెన్స్ డే పోస్ట్ వైరల్

Published : Mar 08, 2023, 05:11 PM IST
నా జీవితంపై ఎంతో ప్రభావం చూపిన మహిళలు వీరే.. చిరంజీవి ఉమెన్స్ డే పోస్ట్ వైరల్

సారాంశం

నేడు ప్రపంచ మహిళా దినోత్సవం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సెలెబ్రిటీలు మహిళలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మహిళల ప్రాముఖ్యత గొప్పతనం వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వెల్లువలా వస్తున్నాయి. 

నేడు ప్రపంచ మహిళా దినోత్సవం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సెలెబ్రిటీలు మహిళలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మహిళల ప్రాముఖ్యత గొప్పతనం వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఉమెన్స్ డే సందర్భంగా బ్యూటిఫుల్ పోస్ట్ పెట్టారు. మహిళలందరికీ శుభాకాంక్షలు చెబుతూ చిరు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 

ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. తమ స్థానం కోసం పోరాడిన, పోరాడుతున్న ఆదర్శవంతమైన మహిళలందరికీ నా సెల్యూట్. భవిష్యత్ తరాలని రక్షించే రెక్కలు మీరే. వీళ్ళిద్దరూ నా జీవితంపై ఎంతో ప్రభావం చూపిన మహిళలు అంటూ చిరు తన భార్య సురేఖ, తల్లి అంజనాదేవితో ఉన్న పిక్స్ పోస్ట్ చేశారు. 

చిరంజీవి తన భార్యపై ప్రేమని, తల్లిపై గౌరవాన్ని తరచుగా చాటుకోవడం చూస్తూనే ఉన్నాం. చిరంజీవి షేర్ చేసిన బ్యూటిఫుల్ పిక్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటోంది. 

సినిమాల విషయానికి వస్తే చిరు చివరగా వాల్తేరు వీరయ్య చిత్రంతో రీసౌండిగ్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో నిరసపడ్డ మాస్ ఫ్యాన్స్.. వాల్తేరు వీరయ్యతో పండగ చేసుకున్నారు. బాబీ తెరకెక్కించిన ఈ చిత్రం మాస్ కి బాగా కనెక్ట్ కావడంతో కాసుల వర్షం కురిసింది. ప్రస్తుతం చిరు మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' చిత్రంలో నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?