Kriti Kharbanda Engagement : పెళ్లి పీటలు ఎక్కబోతున్న బాలీవుడ్ నటి? గ్రాండ్ గా కృతి కర్బందా నిశ్చితార్థం!?

Published : Jan 30, 2024, 04:15 PM IST
Kriti Kharbanda Engagement : పెళ్లి పీటలు ఎక్కబోతున్న బాలీవుడ్ నటి? గ్రాండ్ గా కృతి కర్బందా నిశ్చితార్థం!?

సారాంశం

బాలీవుడ్ నటి కృతి కర్బందా Kriti Kharbanda తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో తను వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. తాజాగా నిశ్చితార్తం కూడా చేసుకుంది. 

ఢిల్లీ బ్యూటీ, నటి కృతి కర్బందా బాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ చిత్రం ‘బోణీ’తో తన నటనా కెరీర్ ప్రారంభించింది. తొలినాళ్లలో సౌత్ చిత్రాల్లో బాగా మెరిసింది.  తెలుగుతో దక్షిణాది సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడే సెటిల్ అయ్యింది. 

తెలుగులో ఈ ముద్దుగుమ్మ నాని ‘అలా మొదలైంది’, పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ (Pawan Kalyan)  నటించిన ‘తీన్ మార్’, మనోజ్ ‘మిస్టర్ నూకయ్య’, ‘ఒంగోలు గిత్త’, ‘ఓం 3డీ’, చివరిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’లోనూ నటించి మెప్పించింది. తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే.. తన వ్యక్తిగత విషయాలనూ అభిమానులతో పంచుకుంటూ ఉంది. 

ఈ క్రమంలో గుడ్ న్యూస్ అందింది. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత పుల్కిత్ సామ్రాట్ Pulkit Samrat అనే వ్యక్తిని ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. ఎప్పటి నుంచో అతనితో ప్రేమలో మునిగితేలుతోంది. ఇక తాజాగా కృతి కర్బందా, పుల్కిత్ నిశ్చితార్థం చేసుకున్నారు.... అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, పుల్కిత్ తన ఇన్‌స్టాగ్రామ్ కథనంలో ఎంగేట్ మెంట్ వేడుకలకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌