పవన్ కళ్యాణ్ కోసం సంవత్సరాలు సమయం వృద్దా చేసుకున్నాడు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్యూచర్ అగమ్య గోచరంగా ఉంది. ఈ క్రమంలో హరీష్ శంకర్ సోషల్ మీడియా జనాలకు భయపడుతున్నాడనిపిస్తుంది.
హరీష్ శంకర్ పరిశ్రమకు వచ్చి 18 ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్లలో దర్శకుడిగా చేసింది కేవలం 7 సినిమాలు. హరీష్ శంకర్ చివరి చిత్రం 2019లో విడుదలైంది. ఐదేళ్లలో ఆయన మరో మూవీ చేయలేదు. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం రీఎంట్రీ ప్రకటించిన పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలకు సైన్ చేశాడు. వాటిలో భవదీయుడు భగత్ సింగ్ ఒకటి. గతంలో పవన్-హరీష్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై హైప్ ఏర్పడింది.
ప్రకటనకే పరిమితమైన భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ లోపు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కూడా అయ్యింది. నిర్మాతల కోసం ఒరిజినల్ స్క్రిప్ట్ అటకెక్కించి, తేరి రీమేక్ కి మార్పులు చేసి ఉస్తాద్ భగత్ సింగ్ అని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కేటాయించిన కొద్దిరోజుల్లో హరీష్ శంకర్ చకచకా కొంత షూట్ పూర్తి చేశాడు. జనసేనకు పొలిటికల్ మైలేజ్ ఇచ్చేలా.. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులను విమర్శించేలా డైలాగులు సిద్ధం చేసి 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే విడుదల చేయాలి అనుకున్నారు.
అయితే పొలిటికల్ షెడ్యూల్స్ ఎక్కువైపోవడంతో పవన్ కళ్యాణ్ సమయం ఇవ్వలేకపోయారు. దాంతో ఎన్నికల తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ అని తేలిపోయింది. చేసేది లేక రవితేజతో మిస్టర్ బచ్చన్ పట్టాలెక్కించి షూటింగ్ జరుపుతున్నాడు. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చాడు హరీష్. ఓ ఇంటి ఫోటో షేర్ చేసి... ఈ అందమైన ఇంటిలో షూటింగ్ చేసేందుకు ఆరాటంగా ఉంది అంటూ కామెంట్ పెట్టాడు.
అయితే హరీష్ శంకర్ సదరు పోస్ట్ క్రింద కామెంట్ సెక్షన్ ఆఫ్ చేశాడు. దీంతో ఆయన కొన్ని విషయాలు మాట్లాడేందుకు ఇష్టపడం లేదనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టం లేకే కామెంట్ సెక్షన్ ఆఫ్ చేశాడని సోషల్ మీడియా టాక్. ముక్కుసూటిగా ఉండే హరీష్ శంకర్ నుండి ఇది ఊహించని పరిణామం...